Logo
Date of Publish : 09 May 2022, 2:59 am
Editor : Sake Naresh

వైసీపీని గద్దె దించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి : చెన్నేకొత్తపల్లి జనసైనికులు

      రాప్తాడు ( జనస్వరం ) : వైసిపి నాయకులు ప్రజా సమస్యల పట్ల దృష్టి పెడితే మంచిదని జనసేన మండల కన్వీనర్‌ క్రాంతికుమార్‌, నాయకులు నరెద్దుల నారాయణ స్వామి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని జూనియర్‌ కళాశాల ప్రాంగణంలో ఆదివారం జనసేన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో క్రాంతి మాట్లాడుతూ విలువలు లేని రాజకీయాలు చేస్తున్న వైసీపీ నాయకులు ప్రతి పక్షాల పట్ల ఆరోపణలు మాని అభివృద్ధి చేసి చూపించాలన్నారు. జనసేన అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ కౌలు రైతుల సమస్యలపట్ల స్పందిస్తున్న తీరు, రాష్ట్ర ప్రజలే కాక దేశ ప్రజలు పహరిస్తున్న తరుణంలో ఈ సమస్యను పక్కదోవ పట్టించి ప్రజల దృష్టిని మళ్లించే కోసం, అధికార పక్షం దొంగ నాటకాలుఆడుతున్నారని, అలాగే ప్రజలని మభ్యపెడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట ప్రజలను కులమతాలగా విభజించి వీరు అధికార కోసం ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి ఈ రెండు పార్టీలకు తగిన బుద్ధి చెబుతామని అన్నారు. జనసేన సైనికులకు గెలుపోటములుతో పనిలేదని తామెవ్పుడూ యుద్దానికి సిద్ధమేనని పేర్కొన్నారు. జనసేన నాయకులు బసంపల్లి నరెద్దుల నారాయణ స్వామి మాట్లాడుతూ మార్పు అనేది ఒక్కరితోనే మొదలవుతుందని, ఒక్క అడుగుతోనే
ప్రయాణం మొదలు అవుతుందని సంకల్పం పట్టిన సాయుధుడై పవన్‌ కదిలదన్నారు. కొత్తతరం రాజకీయ సేద్యం చేస్తున్న కర్షకుడిగా వ్యవసాయం చేస్తూ అప్పుల బారిన పడి ఆర్థిక ఇబ్బందుల వల్ల బలవన్మరణాల బారిన పడినకౌలు రైతులకు సాయం అందించే ధైర్యం తానే అంటూ అడుగులు వేస్తూ పవన్‌ ప్రజలకు రైతులకు అండగా నిలుస్తున్నాడని పేర్కొన్నారు. తన స్వార్దితంతో అండగా నిలవాలని, అలసిన కుటుంబాలకు ఆదరణ అందించే అన్నగా “కౌలు రైతుల భరోసా యాత్ర” మొదలు పెట్టాడని,అధికారం, అడ్డదారుల్లో ఆర్జన, అక్రమాలు, ఆశ్రిత జన పక్షపాతం, అణిచివేతలు పరమావధిగా కొనసాగే రాజకీయ ముఖచిత్రం మార్చేందుకు తన పంథాలో నడుస్తూ పవన్‌ కళ్యాణ్‌ రాజకీయ ములో కొత్త మార్పు తెస్తున్నాడని తెలిపారు. మండలంలో ఈ ఆత్మీయ సభతో మరింత ఊపు ఉత్సాహం నాయకుల్లో కార్యకర్తల్లో వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గంగనా లోకేష్‌ రెడ్డీ, వెంకటరమణ, సాకే నాగరాజు, ధన శేఖర్‌, చిట్రా రమేష్‌ నాగసముద్రం జనసేన పార్టీ సర్పంచ్‌ అభ్యర్థి మహిళా శంకుంతల. పేక్‌ దాదాపిర్‌ మండల జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com