Logo
Date of Publish : 27 April 2021, 8:48 am
Editor : Sake Naresh

ప్రస్తుత పరిస్థితులు చూస్తే ప్రభుత్వ అసమర్థ పాలనకు అద్దం కడుతోంది : జనసేన నాయకులు గంధం శెట్టి దినకర్ బాబు

                  ప్రస్తుతం మానవులను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ నిరోధించే కార్యక్రమంలో రైల్వేకోడూరు ప్రజానీకానికి ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తున్నదని జనసేన పార్టీ స్థానిక నాయకులు గంధం శెట్టి దినకర్ బాబు ఆరోపించారు. మార్చి నెల రెండవ వారంలో లేదా మూడవ వారంలో మొదటి కోవ్యాక్సిన్ టీకా డోస్ వేసుకున్న ప్రజలకు ఇంతవరకు రెండవ టీకా వేయడం లేదన్నారు. టీకా స్టాక్ లేకపోవడం కారణంగా రెండో డోస్ అందించడంలో హెల్త్ అధికారులు పూర్తి నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే ప్రభుత్వ యంత్రాంగం, స్థానిక నాయకత్వం, హెల్త్ అధికారులు ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ప్రజల ఆరోగ్యం మిగతా జిల్లాలలో ఎలా ఉందో ఒక్కసారి ప్రజలు ఆలోచించుకోవాలి అన్నారు. 2వ డోస్ సకాలంలో అందని కారణంగా ప్రజలు తాము తెలియకుండానే కరోనా బారిన పడుతున్నారని భయాందోళనకు గురవుతున్నారని అన్నారు. కడప జిల్లాకు పక్కనే గల జిల్లాల్లో దొరికే ఈ రకం టీకలు కడప జిల్లాలోనే ఎందుకు దొరకడం లేదని ప్రశ్నించారు. కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేయడం సంతోషకర వార్త అంటూనే అన్నిరకాల సదుపాయాలను కోడూరు కోవిడ్ సెంటర్ లో ఏర్పాటు చేయాలని, ఆక్సిజన్ నిల్వలను తగిన స్థాయిలో ఉంచాలన్నారు. ప్రభుత్వ ఆరోగ్య శాఖ అధికారులు కోవ్యాక్సిన్ రెండవ డోసు ప్రజలకు త్వరలో అందిస్తారని కోరుతున్నామన్నారు. తక్షణమే ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విన్నవించుకున్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com