Logo
Date of Publish : 10 September 2020, 11:27 am
Editor : Sake Naresh

అంతర్వేదిలో రధం దగ్దము చేసిన దోషులును వేంటనే శిక్షించాలి. అక్రమంగా అరెస్ట్ చేసిన జనసేన, బీజేపీ నాయకులని విడుదల చేయాలి..

అంతర్వేదిలో రధం దగ్దము చేసిన దోషులును వేంటనే శిక్షించాలి. అక్రమంగా అరెస్ట్ చేసిన జనసేన, బీజేపీ నాయకులని విడుదల చేయాలి.

               అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఉన్న శ్రీ స్వామి వారి కల్యాణ రధం షెడ్డులో భద్రపరిచిన రథానికి మంటలు అంటుకొని దగ్దం  జరిగిన సంఘటన జనసేన బీజేపీ తీవ్రంగా ఖండిస్తు, దీక్ష చేపట్టటం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన నాయకులు ఈమని కిషోర్ కుమార్ మాట్లాడుతూ ఇది ప్రమాదవశాత్తు జరిగిందా, ఆకతాయిల పనా అనేది తెలియవలసిఉన్నది అని, ఏది ఏమి అయినప్పటికీ, దేవాలయాలలో ఇలా జరగటం అనేది చాలా బాధాకరం అని, అంత పవిత్ర పుణ్యక్షేత్రంలో సరి అయిన భద్రత లేకపోవటం, సిసి కెమెరాలు లాంటివి ఏర్పాటు చేయకపోవటం దేవాలయం అధికారుల నిర్లక్ష్యం పూర్తిగా కనపడుతుంది అని, ఆ రథంకు సరిఅయిన సెక్యూరిటీ కూడ ఏర్పాటు చెయ్యకపోవటానికి కారణాలు ఏమిటి? దేవుని కళ్యాణ రధం కాలిపోవటం అనేది చాలా దురదృష్టకరం. ఈ సంఘటన భక్తులు మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నది అని, అదే విధంగా పిఠాపురంలో దేవత విగ్రహలు పగలకొట్టటం, నెల్లూరులో రధం కాలిపోవటం, రాష్ట్రంలో ఇలాంటి వరుస సంఘటనలు జరగటం వలన భక్తులు మనోభావాలు దెబ్బతింటున్నాయి. అధికారులు కూడ పొంతన లేని విషయాలు చెపుతున్నారు. కొంతమంది మతి స్థిమితం లేనివారు ఇలాంటి పనులు చేస్తున్నారు అనీ, తేనే చుట్టూ కోసం నిప్పు పెట్టినారు అనీ చెప్పటమే కొన్నీ అనుమానాలకు దారి తీస్తుంది అని, దేవాలయ శాఖ అధికారులు ఇంత నిర్లక్ష్యంగా ఉండటం చాలా బాధాకరం అని ఆయన తెలిపారు. ప్రభుత్వం, దేవాలయ శాఖ అధికారులు ఈ సంఘటన పై పూర్తి విచారణ జరిపించి, హై కోర్టు జడ్జి గారి ద్వారా న్యాయ విచారణ జరిపించి, ఈ సంఘటనకు కారకులు అయిన వారిపైన చట్ట పరంగా కఠిన చేర్యలు తీసుకోవాలి అనీ, వెంటనే స్వామి వారికీ నూతన కల్యాణ రధం తయారు చేయించి, భక్తులు మనోభావాలు కాపాడాలి అనీ,  జనసేన పార్టీ తరుపున కోరుచున్నాము అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన బీజేపీ నాయకులు, కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు.

All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com