తెలంగాణ, (జనస్వరం) : ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు అన్ని కలిసి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన జనసేన విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు సంపత్ నాయక్ మాట్లాడుతూ నిఖిల్ కుటుంబానికి భరోసా ఇస్తూనే నిఖిల్ మరణానికి కారకులైన వారిని శిక్షించే వరకు జనసేన విద్యార్థి విభాగం తోడుగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. బలహీనవర్గాలు అయిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ, న్యాయవ్యవస్థ గాని పూర్తిస్థాయిలో పనిచేయడం లేదు. ఈ వర్గాలని బానిస వర్గాలుగానే చూస్తున్నారని కేవలం వీరి ఓట్లు మాత్రమే రాజకీయ నాయకులకు కావాలి ప్రశ్నించే తత్వం అలవాటు లేకపోవడం ద్వారానే ఈ వర్గాలపై దాడులు జరగుతున్నాయి. ఈ కేసు విషయంలో జిల్లా స్థాయి ఎస్పీ, 5 సీఐలను పెట్టిన కానీ కేసులో ఎటువంటి పురోగతి లేకపోవడం పొలీస్ వ్యవస్థ పైన అనుమానాలు వస్తున్నాయి. అంతే కాకుండా దోషులకు రాజకీయ పలుకుబడి ఉన్నట్టుగా స్థానికులు చెపుతున్నారు. అందుకే కేసులోఎటువంటి పురోగతి లేదని మేము భావిస్తూ పోలీసువ్యవస్థ న్యాయం చేసి నిరూపించుకోవలసిన అవసరం ఉంది. అలాగే నిఖిల్ కుటుంబానికి న్యాయం జరిగే వరకూ అండగా ఉంటామని జనసేన విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు సంపత్ నాయక్ భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు మహేష్ పెంటల, ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్షులు వినోద్ నాయక్, నిజాం కళాశాల విద్యార్థి నాయకులు మోతిలాల్, విద్యార్థులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com