రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నా ఆర్తనాదాలు...
కరోనా అని ఆర్థిక సంక్షోభం అని సాకులు చెపుతున్నారు. మరి ఈ ఆర్థిక సంక్షోభంలో మినిస్టర్స్ మరియు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకి జీతాలు తీసుకుంటున్నారుగా వాళ్ళకి వర్తించదా?? దేశంలో సీఎంకి అయినా 78 మంది సలహాదారులు వున్నారా?? మరి వాళ్ళని కూర్చోపెట్టి నెలకు 2.5 నుండి 3.0 లక్షలు ఇవ్వటానికి ఏ ఆర్థిక సంక్షోభం వుండదు కదా... జనాన్ని సోమరిపోతులుగా మార్చి నెల నెలా ఇచ్చే పథకాలకు ఏ ఆర్థిక సంక్షోభం లేదు. ఉద్యోగుల దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం గుర్తుకు వచ్చింది అన్నమాట ఈ సంక్షోభం. మరి మా జీతాలు తగ్గించినట్లుగా పెట్రోలు, పప్పులు, ఉప్పులు, వంట నూనెలు, కూరలు, పండ్లు, వంట గ్యాస్, ఇంటి పన్నులు, ఇంటి అద్దెలు, బస్ ఛార్జీలు, రైల్ ఛార్జీలు కూడా వెంటనే తగ్గించండి. అయ్యా మా పిల్లలకు కూడా అమ్మ ఒడి, మా అమ్మ నాన్నలకు వృద్ద్యాప్య పెన్షన్, మా కుటుంబ౦లో కూడా పొలం పనులు చేసే వారికి రైతు భరోసా ఇవ్వండి. మా నుండి ఏ విధమైన సొమ్ము వసూలు చేయకుండా వైద్యము ఫ్రీ గా చేయించండి. పేదలకు ఇల్లు లిస్ట్ లో మాకు కూడా ఇల్లు ఇవ్వండి. అప్పుడు మీ PRC కరెక్ట్ అని ఒప్పుకుంటాము. సెంట్రల్ గర్నమెంట్ ప్రకారం HRA ఇస్తున్నాము అన్నారు మరియు ఆ ప్రకారంగా DA, Bonus మిగతా అలవెన్స్ లు కూడా ఇవ్వాలి కదా... మరి వాటి మాట ఏమిటి ??? ప్రతి చిన్న విషయానికి ప్రెస్ ముందు వచ్చే ఆ పెద్ద మనుషులు ఇపుడు ఎందుకు అని ముందుకు రావడం లేదు. ఐ.ఆర్ కంటే తక్కువ ఫిట్మెంట్ ఇవ్వడమే కాకుండా, ఇంటి అద్దె భత్యాలను తగ్గించడం, డిఏ లు ఇవ్వకపోవడం దేశంలోనే మొదటి సారి. గతంలో పాదయాత్రలో CPS రద్దు చేస్తా అని మాటిచ్చి, తీరా మాకు వాటి గురించి అవగాహన లేక మాట ఇచ్చాం, ఇపుడు మాట తప్పుతామ్ అనడం మీ అవివేకతనానికి, సిగ్గుకి నిదర్శనం. మా ఉద్యోగుల జీవితాలు మారుస్తావని బ్యాలెట్ కవర్లో నీకు ఓటేస్తే ఈ రోజు మమ్మల్ని రోడ్డుకి ఈడ్చావు. ఇంకోసారి నీకు ఓటు వేయడం అంటే నేను సామాజిక ఆత్మహత్యకు పూనుకోవడమే...
- ఓ ప్రభుత్వ ఉద్యోగి
Source : ఇంటర్నెట్ ఆధారిత
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com