ఒంగోలు, (జనస్వరం) : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తన పాదయాత్రలో ఆంధ్రరాష్ట్ర ఆడపడుచులకు మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పి ఇప్పుడు అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ ను మద్యాంధ్రప్రదేశ్ గా మార్చిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిది. దీనిలో భాగంగా ఈరోజు ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ గారి ఆదేశాల మేరకు ఒంగోలులోని అద్దంకి బస్టాండ్ వద్ద వీర మహిళలు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్బంగా ఒంగోలు నగర జనసేన పార్టీ అధ్యక్షులు మలగా రమేష్ మాట్లాడుతూ పాదయాత్రలో మద్యం నిషేధం చేస్తానని మాయ మాటలు చెప్పి ఇప్పుడు మద్యం అమ్ముకుంటున్న వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అని, అధిక ధరలకు మద్యం అమ్ముకుంటున్న ఈ ముఖ్యమంత్రి వల్ల కుటుంబాలు గుల్లఅవుతున్నాయని, ఇప్పటికైనా పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం మద్యనిషేధం చేయాలని లేనిపక్షంలో జనసేన వీర మహిళ ఆధ్వర్యంలో పోరాటం చేస్తాము అని అన్నారు. అలాగే రాష్ట్ర జనసేన పార్టీ అధికార ప్రతినిధి అరుణ రాయపాటి మాట్లాడుతూ రాష్ట్రంలో కల్తీసారా ఏరులై పారిస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్ రెడ్డికే దక్కుతుంది. అధిక ధరలకు మద్యం కొనలేక కల్తీసారా కు బానిసై ఇటీవల రాష్ట్రంలో జంగారెడ్డిగూడెంలో 24 మంది చనిపోవడం వాటినీ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా సహజ మరణాలు అని చెప్పడం సిగ్గుచేటు అని, ఇచ్చిన హామీ ప్రకారం మద్యనిషేధం చేసి కల్తీసారాను అరికట్టాలని లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధం అవుతాము అని తెలియజేశారు. ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి కళ్యాణ్ ముత్యాల మాట్లాడుతూ మద్యం అమ్ముకుంటూ ధనార్జనే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం కొనసాగుతుందని, కల్తీసారాను అరికట్టడంలో జగన్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని, రానున్న ఎన్నికల్లో ఆంధ్రరాష్ట్ర మహిళలందరూ ముక్తకంఠంతో ఈ ప్రభుత్వాని బంగాళాఖాతంలో కలపడానికి సిద్ధమయ్యారని అని అన్నారు. ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పల్ల ప్రమీల మాట్లాడుతూ అధిక ధరలకు మద్యం అమ్ముతూ జగన్ రెడ్డి ప్రభుత్వం కుటుంబాలను గుల్ల చేస్తుందని, అధిక ధరలకు మద్యం కొనలేక శానిటైజర్ తాగి మరణాలు సంభవించడం జరిగింది అని అన్నారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీ ప్రకారం మద్యనిషేధం చేసి మాట నిలబెట్టుకోవాలని లేనిపక్షంలో వీర మహిళల ఆధ్వర్యంలో ఉధృతమైన ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా చేస్తామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి రాయని రమేష్, ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శులు దండే అనిల్, ఆర్ కె నాయుడు ముత్యాల, పల్ల ప్రమీల, ఒంగోలు నగర జనసేన పార్టీ కార్యదర్శులు మనోజ్ రాయల్స్, నరేంద్ర వేంప, సుధాకర్, చంగళశెట్టి, గోవింద్, కోమలి, ఒంగోలు నగర జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శులు ఉష, ఆకుపాటి ఉష, 38వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు అలా నారాయణ, 25వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు పోకల నరేంద్ర, చీమకుర్తి మండల జనసేన నాయకులు ముత్యాల సురేష్, జనసేన నాయకులు చక్క శబరినాధ్, తోట రాజ్ కుమార్, శాలు, శ్రీను, అవినాష్ నాయుడు, గోపిశెట్టి వెంకటేష్, నవీన్ నాయుడు, పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.