Logo
Date of Publish : 12 November 2022, 3:53 pm
Editor : Sake Naresh

రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవినీతిని త్వరలోనే ఎండగడతాం : పాయకరావుపేట జనసేన నాయకులు

    పాయకరావుపేట, (జనస్వరం) : ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అవినీతిపై త్వరలోనే నిజానిజాలను వెలికి తీసి అవినీతిని ఎండగడతామని రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్, యూత్ అధ్యక్షులు గెడ్డం చైతన్య పేర్కొన్నారు. ఈ మేరకు వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశాల మేరకు నాయకులు గెడ్డం బుజ్జి ఆధ్వర్యంలో ఈ నెల 12, 13, 14, తేదీలలో అన్ని సచివాలయాల్లో పేదల ఇళ్లపై చర్చించి నిజాలను వెలికి తీసి ప్రజలకు తెలియజేస్తామని అన్నారు. అదే విధంగా ఒక నిమిషం తగ్గకుండా వైయస్సార్ ప్రభుత్వం చేపడుతున్న అవినీతిని వీడియో చేసి ఫేస్ బుక్, ట్విట్టర్, సోషల్ మీడియాలో పెట్టాలని పిలుపునిచ్చారు. ప్రతి విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలకు అన్యాయం జరగకుండా మాట్లాడుతుంటే అతనిపై బురదలో కార్యక్రమం చేయడం సమంజసం కాదని త్వరలోనే జనసేన పార్టీ సత్తా చూపిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జక్కం దొర, పల్లి దుర్గారావు,ఆచంట దొర, పులగాపురి అప్పల నరస, రాజా రమేష్, బొండ సత్యనారాయణ, శివలంక నాగమల్లి, నల్లల రత్నాజీ, కర్రీ బాబురావు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com