చీపురుపల్లి ( జనస్వరం ) : నియోజకవర్గలో రాష్ట్రంలో రహదారుల దుస్థితి చూసి ఈ ప్రభుత్వ పెద్దలు సిగ్గుపడాలని విజయనగరం జిల్లా టిడిపి అధ్యక్షులు కిమిడి నాగార్జున అన్నారు. టీడీపీ - జనసేన ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమం ఆదివారం కూడా కొనసాగింది. చీపురుపల్లి -బిళ్లలవలస మార్గంలోని వెదుళ్లవలస గ్రామం వద్ద జనసేన టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేశారు. ఈ మార్గంలో ప్రయాణం నరకంగా మారిందని స్థానికులు కిమిడి నాగార్జున గారు కు మరియు విసినిగిరి శ్రీనివాసరావు కు వివరించారు. స్థానిక ప్రజా ప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడంలేదని, తరచూ రహదారి ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. అనంతరం కిమిడి నాగార్జున మాట్లాడుతూ.. అధ్వాన రహదారుల వల్ల ప్రజల ప్రాణాలు పోతున్నా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదన్నారు. ప్రతినెలా వేల కోట్ల రూపాయలను అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని నడిపిస్తున్న జగన్ ప్రభుత్వం.. అందులో మౌలిక సదుపాయాలకు కనీసం కేటాయింపులు చేయకపోవడం దారుణమన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఇలాంటి మార్గాల్లో ఎలా ప్రయాణించగలరని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, పైల బలరాం , రౌతు కామునాయుడు, వెన్నీ సన్యశినాయుడు. దాన్నాన రామచంద్రుడు, సారేపాక సురేష్ బాబు, మణిపురి సూర్యనారాయణ, కిలారి సూర్యనారాయణ, జనసేన పార్టీ నాయకులు తుమ్మగంటి సూరినాయుడు, రౌతు కృష్ణవేణి, ఎచర్ల పార్వతి, పెద్ది వెంకటేష్, సాసుబుల్లి రాము నాయుడు, సిగ తవిటి నాయుడు ఎచర్ల లక్షము నాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com