బాపట్ల ( జనస్వరం ) : మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశంలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈనెల ఎనిమిదో తారీకు నుండి 22వ తారీకు వరకు ఎంఆర్‌పిఎస్ ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు కొనసాగించాలని నిర్ణయించారు. చివరి రోజున కలెక్టర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమమును విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా ఇన్చార్జి వర్ల దేవదాసు మాదిగ, ఎంఆర్‌పిఎస్ బాపట్ల జిల్లా అధ్యక్షుడు బుడం గుంట్ల లక్ష్మీ నరసయ్య మాదిగ, బాపట్ల పట్టణ కన్వీనర్ తాళ్లూరు రాజేష్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లాకు కన్వీనర్ దుడ్డు వందనం మాదిగ, బాపట్ల మండల ఇన్చార్జి మల్లవరపు గాంధీ మాదిగ, మాసిపోగు వేణు మాదిగ, వేమూరి నియోజకవర్గ ఇన్చార్జి దాస్ మాదిగ, సాగర్ మాదిగ రాకేష్ మాదిగ, చక్రవర్తి మాదిగ, ఏసు పాదం మాదిగ, నవీన్ మాదిగ, సునీల్ మాదిగ, మరి దాసు మాదిగ, దుడ్డు రాంబాబు మాదిగ, ఏసురత్నం బాబు, మోషే, అమ్మి మాదిగ, మున్నా మాదిగ, రవీంద్ర, ఆంటోనీ, కిషోర్, అనిల్ మరియు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com