Search
Close this search box.
Search
Close this search box.

ముఖ్యమంత్రిని మంచి ఇ.ఎన్.టి. వైద్యుడికి చూపించాలి

ముఖ్యమంత్రి

• ఆయనకు వినికిడి శక్తి లోపించింది
• శ్రీ పవన్ కళ్యాణ్ ఒకటి మాట్లాడితే… జగన్ రెడ్డి కి మరోలా వినిపిస్తోంది
• 30 మంది స్టెప్నీలు అనగానే సీఎం ఎందుకు ఉలిక్కిపడుతున్నారు
• రాసలీలలకు కేరాఫ్ అడ్రస్ వైసీపీ
• ఉత్తరాంధ్రను గంజాయి, కబ్జాలకు అడ్డాగా మార్చింది ఎ1, ఎ2లు కాదా?
• మంత్రులు భాష మార్చుకోకపోతే … జగన్ రెడ్డికి ఇచ్చినట్లు వరంగల్ ట్రీట్మెంట్ ఇస్తాం
• జనసేన పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ అర్హం ఖాన్, పార్టీ నేతలు శ్రీ షేక్ రియాజ్, శ్రీ నేమూరి శంకర్ గౌడ్

       హైదరాబాదు ( జనస్వరం ) : జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనం కష్టాలను తెలుసుకోవాలని జనవాణి కార్యక్రమం పెడితే… ముఖ్యమంత్రి శ్రీ జగన్ రెడ్డి దానిని అడ్డుకోవడం దుర్మార్గమని జనసేన పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ అర్హం ఖాన్ పేర్కొన్నారు. అసత్యాలు మాట్లాడటం, నిజాలను వక్రీకరించడం, వ్యక్తిగత దూషణకు దిగడం ఆయన నైజమని అన్నారు. గురువారం హైదరాబాద్ జనసేన కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఈ రోజు అవనిగడ్డలో చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ప్రకాశం జిల్లా ఇంఛార్జి శ్రీ షేక్ రియాజ్, పార్టీ తెలంగాణ ఇంచార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్ మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా అధ్యక్షులు శ్రీ షేక్ రియాజ్ మాట్లాడుతూ… “గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్ రెడ్డి గారిని అత్యవసరంగా బాగా అనుభవం ఉన్న ఈ.ఎన్.టి. డాక్టర్ కి చూపించాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాంటి డాక్టర్ హైదరాబాద్ లో ఉన్నా బెంగళూరులో ఉన్నా పిలిపించి జగన్ గారి చెవులు, గొంతు, నాలుక చెక్ చేయించాలి. ఇవాళ కృష్ణా జిల్లా అవనిగడ్డ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి గారు ప్రజలను మోసం చేసేలా శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి పచ్చి అబద్ధాలు మాట్లాడారు. ఆయనకు వినికిడి శక్తి లోపించి… చెవిటితనంతో బాధపడుతున్నారు. మూడు పెళ్లిళ్లు చేసుకుంటే మంచిదని శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు మాట్లాడారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏనాడు అలా మాట్లాడలేదు. ఒక పెళ్లి చేసుకొని 30 మంది స్టెప్నీలను పెట్టుకొనే వాళ్ళ గురించి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడగానే ముఖ్యమంత్రి గారు ఎందుకు భుజాలు తడుముకున్నారో, ఎందుకు ఉలిక్కిపడుతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి.
• దమ్ముంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి రండి… ప్రజా తీర్పు కోరదాం
చాలా మంది వైసీపీ నాయకులకు ఎంతమంది స్టెప్నీలు ఉన్నారో ఎవరికీ తెలియదు. ఒక మంత్రి అరగంట, పావుగంట అంటాడు. సుకన్య, సంజన పోయి ఈ మధ్య ప్రశాంతి వచ్చింది. ఉత్తరాంధ్రకు చెందిన మరో మాజీ మంత్రి గంట చాలు అంటాడు. ఇంకో ఎంపీ ఏకంగా ప్యాంటు జిప్ విప్పి చూపిస్తాడు. రాసలీలలకు వైసీపీ బ్రాండ్ అంబాసిడర్. మీలాంటి వ్యక్తులా శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 175 సీట్లకు గానూ 175 గెలుస్తామని గొప్పలు చెప్పుకుంటున్నారు. మీకు నిజంగా దమ్ముంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి ప్రజల తీర్పు కోరుదాం రండి.
• విశాఖ వెళ్లాలంటే అనుమతి కావాలా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికే ఉందా? అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో ఉందా? ఎవరైనా ఉత్తరాంధ్రాకు రావాలంటే పర్మిషన్లు తీసుకోవాలా? అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పర్యటనను అడుగడుగునా అడ్డుకున్నారు. విమానాశ్రయం వద్దకు ఆయనకు స్వాగతం చెప్పడానికి వచ్చిన జనాన్ని చూసి ఓర్వలేక జనవాణి కార్యక్రమం జరగకుండా చేశారు. ఎయిర్ పోర్టులో మంత్రులపై దాడి జరిగిందని వైసీపీ వాళ్లు మాట్లాడుతున్నారు. ప్రశాంతతకు మారుపేరైన ఉత్తరాంధ్రను గంజాయి వనంగా, కబ్జాలకు కేంద్రంగా మార్చింది ఎ1 జగన్, ఎ2 విజయసాయి రెడ్డి కాదా? మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావం తెలపడానికి వస్తే ప్యాకేజీ అని మాట్లాడుతున్నారు. ఆయన ప్యాకేజీ తీసుకోవడానికి బ్రోకరిజం చేసింది మీయమ్మ మొగుడా? లేకపోతే తెరచాటుగా మీరే చేశారా? అనేది ఆ మాట మాట్లాడే వాడు చెప్పాలి. ఇలాంటి భాష మాట్లాడటానికి సిగ్గుపడుతున్నాం. కానీ బూతుల మంత్రులకు ఇలా మాట్లాడితేనే అర్ధమవుతుందని ఇలా చెబుతున్నాం. వాళ్లు మాట్లాడే భాష చూసి వాళ్ల తల్లిదండ్రులు కూడా సిగ్గుతో తలదించుకుంటున్నారు. మీకు చేతనైతే శ్రీ పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి. అంతే తప్ప వ్యక్తిగత దూషణలకు దిగితే చూస్తూ ఊరుకునేది లేదు. దమ్ముంటే ఉత్తరాంధ్ర రా అని సవాల్ చేసిన గుడివాడ అమరనాథ్ అనే వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు విశాఖ రాగానే ప్రజాసందోహం చూసి దాక్కుండిపోయాడు. టైమ్, ప్లేస్ చెప్పండి అని జోగి రమేష్ ఛాలెంజ్ చేశాడు… ఆయనకు ఒకటే చెబుతున్నాం. మీ స్థాయికి పవన్ కళ్యాణ్ గారు అవసరం లేదు. జనసైనికుడు చాలు. ఇంకోసారి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే తరిమితరిమి కొడతాం. చెత్త పుత్రుడు జగన్ రెడ్డిగానీ, అతని పార్టీవాళ్ళు గానీ మరోసారి ఇలాంటి చెత్త వాగుడు వాగితే వాళ్ళ ఇళ్ళకి చెప్పులు పార్సిల్ పంపిస్తాం” అని అన్నారు.
• వైసీపీ వాళ్ళ ఉగాండా పెట్టుబడులు బయటకు తెస్తాం: శ్రీ నేమూరి శంకర్ గౌడ్
తెలంగాణ జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీ నేమూరి శంకర్ గౌడ్ మాట్లాడుతూ… “ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమని వైసీపీకి అవకాశం ఇస్తే… ఉగాండా దేశాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఆ ప్రాంతంలో లిక్కర్ బిజినెస్ చేస్తూ కోట్లు కూడబెడుతున్నారు. ఆ వివరాలన్నీ బయటకు తెస్తాం. త్వరలోనే దీనిని ప్రజల ముందు పెడతాం. శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. మీరు భాష మార్చుకోకపోతే వరంగల్ లో జగన్ ను ఎలాగైతే రాళ్లతో కొట్టి తరిమారో … మీకు కూడా అలాంటి ట్రీట్మెంటే ఇస్తాం. ప్యాకేజీ స్టార్ అనే వెధవలకు మేము ఒకటే చెబుతున్నాం. ఆయన్ను కొనే మగాడు ఇంకా పుట్టలేదు. మా నాయకులను ప్రజల వద్దకు వెళ్లకుండా మీరు ఎలాగైతే అడ్డుకుంటున్నారో… మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు అలానే అడ్డుకుంటామ”ని హెచ్చరించారు.
• ముఖ్యమంత్రికి అసలు బుద్ధి ఉందా? : శ్రీ అర్హం ఖాన్
పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ అర్హం ఖాన్ గారు మాట్లాడుతూ “ముఖ్యమంత్రి మనసుకు తోచినట్లు చేస్తుంటారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషిస్తారు. ఒక కులానికి ఆయన్ను అపాదించడం అలవాటు అయిపోయింది. శ్రీ పవన్ కల్యాణ్ గారి సిద్దాంతాలపై అభిప్రాయ భేదాలు ఉంటే.. ప్రజాస్వామ్య పద్దతిలో వాటిని వ్యతిరేకించండి. అంతే తప్ప ఆయన ఫలానా సామాజిక వర్గంలో జన్మించాడని ఆ వర్గం మీద విషాన్ని చిమ్మకండి. బుద్ది ఉన్నవారెవరు ఇలా చేయరు. మీలాంటి వాళ్లను బుద్ది ఉన్నవాళ్లు అనాలా ? లేక మూర్ఖులు అని సంభోదించాలో తెలియడం లేదు. మైనారిటీలందరూ శ్రీ పవన్ కల్యాణ్ గారి పక్షానే ఉన్నారు. మైనారిటీ ప్రజలందరి తరపున చెబుతున్నాము… ఆంధ్రప్రదేశ్ లో మైనారిటీల సమస్యలపై న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం. ఎదుర్కొనేందుకు మీరు సిద్దమవ్వండి. మీరు నిర్లక్ష్యం చేసిన వక్ఫ్ భూములతో పాటు, మైనారిటీల హక్కుల గురించి పోరాడే దిశగా మేమంతా సిద్దమవుతున్నాం. అంతేకాదు గతంలో మీరు ముస్లింల కోసం అనేక హామీలను ఇచ్చి వాటిని అమలు పరచడంలో విపలమయ్యారు. ఈ అన్యాయాన్ని మేం సహించం. మా హక్కుల కోసం ఎంతవరకు పోరాటం చేయాలో అక్కడివరకు పోరాడుతాం .. సాధించి తీరుతాం” అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way