Logo
Date of Publish : 21 October 2023, 8:34 pm
Editor : Sake Naresh

అనంతరాజుపేటలో జనసేన నుండి వైసీపీలో చేరికలు ప్రచారం అవాస్తవం

         రాజంపేట ( జనస్వరం ) : అనంతరాజుపేట గ్రామపంచాయతీకి చెందిన జనసేన నాయకులు, వీర మహిళలు తెలుగుదేశం పార్టీ నాయకుల సమక్షంలో ప్రెస్ మీట్  నిర్వహించడం జరిగింది. అదే గ్రామానికి చెందిన బండారు మల్లి వైసిపి వ్యక్తి అనంతరాజుపేట గ్రామంలోని జనసేన నాయకులు వైసిపిలో 60 కుటుంబాలు చేరాయి అని చెప్పి తప్పుడు ప్రకటన ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆ ప్రకటనను తీవ్రంగా ఖండించడం జరిగింది. అనంతరాజుపేట గ్రామానికి మొన్న మిథున్ రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు వచ్చిన సందర్భంలో..... వైసీపీ నాయకుడు మల్లి కుటుంబ సభ్యులకు, తన బంధువులకు తనకు తానే వైసిపి కండువాలు కప్పి మరియు ఊరి సభ్యులకు ఎంపీ గారు వస్తున్నారు రండి అని చెప్పి అందరికీ వైసిపి కండువాలు కప్పాడు. ఇలా 60 కుటుంబాలు వైసీపీలో చేరాయని ఎంపీ గారి ముందు మెహర్బానీ పొందడానికి ఎమ్మెల్యే గారి మన్ననలు పొందడానికి ఇలా చేశాడు. ఊరులోని సభ్యులందరూ అసలు విషయం తర్వాత తెలుసుకొని విస్మయానికి గురయ్యారు. జనసేన అభిమానులుగా ఉన్న మాకు ఇలా చేయడం ఏంటని మండిపడుతున్నారు. మరొకసారి ఇలాంటి చేష్టలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని జనసేన టిడిపి వేదిక ఘాటుగా ప్రెస్ మీట్ సందర్భంగా తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మర్రి రెడ్డి ప్రసాద్, ముద్దపోలు రామసుబ్బయ్య, గిద్దలూరు భాను ప్రకాష్, వీర మహిళ శింగిరి శివమ్మ, సింగిరి రాజ్ కుమార్, గిద్దలూరు శివ, బండారు దుర్గ ప్రసాద్, సింగిరి మహేష్, డేగల మహేష్, మర్రి సన్నీ, మద్దిశెట్టి పెద్దన్న, సింగిరి వెంకటేష్, మర్రి వెంకటేష్ తెలుగు దేశం నాయకులు కొర్లకుంట శంకరయ్య మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com