గత మూడు రోజులుగా రాష్ట్రంలో అదే విధంగా జగ్గయ్యపేట పట్టణంలో కురిసినటువంటి భారీ వర్షాలకు స్థానిక బైపాస్ రోడ్ మార్గంలో వర్షపు నీరు ఆగి ఉండడంతో రోడ్ మార్గం గుంతలు గుంతలుగా మారి వాహన దారులకు ఇబ్బందిగా ఏర్పడిందని త్వరితగతిన మరమ్మతులు చేయాలని నియోజకవర్గ జనసేన నాయకులు ఈమని కిషోర్ కుమార్ పత్రికా ముఖంగా తెలియచేసారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పట్టణ పరిధిలో ఉన్నటువంటి అనేక రకాల సిమెంట్ కర్మాగారాలకు రవాణా కోసం కొన్ని వందల లారీలు ఈ బైపాస్ రోడ్ మార్గం మీదుగానే వెళ్తుంటాయని, ముత్యాల, వేదాద్రి, పులిచింతల వెళ్లే యాత్రికులు కూడా ఈ మార్గం మీదుగానే వెళ్లే సమయంలో వారు అనేక రకాల ఇబ్బందులకు గురి అవుతున్నారని తెలిపారు. ప్రభుత్వం చెత్త పన్ను, ఇంటి పన్ను అన్ని అనేక రకాల పన్నుల రూపంలో ప్రజలపై భారం పెడుతున్నపుడు ప్రజలకు అవసరమైన ఈ రోడ్ మార్గాన్ని ఎందుకు పట్టించుకోరు అని నియోజకవర్గ జనసేన పార్టీ తరుపున ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎం యల్ ఏ గారు మరియు కమిషనర్ గారు కూడా దేని మీద శ్రద్ధ పెట్టి సంబంధిత అధికారికి తెలియచేసి త్వరితగతిన ఈ బైపాస్ రోడ్ మార్గానికి మరమ్మతులు చేపించవల్సినదిగా మా అధ్యక్షల వారి తరుపున పట్టణ జనసేన పార్టీ తరుపున కోరుచున్నాము. లేని యడల పెద్ద ఎత్తున దేని మీద పోరాటం చేస్తాం అని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో త్రిశాంత్, రాం, హేమంత్, పవన్, నాగ తదితరులు పాల్గొన్నారు.