బనగానపల్లె, (జనస్వరం) : ట్రూ అప్ చార్జీల పేరుతో పెంచిన కరెంటు ఛార్జీలను వెంటనే తగ్గించాలని బనగానపల్లె జనసేన పార్టీ నాయకులు భాస్కర్ గారు అన్నారు. బుధవారం బనగానపల్లె పట్టణంలో విలేకర్ల సమావేశంలో భాస్కర్ మాట్లాడుతూ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు తాము అధికారంలోకి వస్తే కరెంటు చార్జీలు తగ్గిస్తామని చెప్పి, ప్రజలపై భారం మోపము అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంట్ ఛార్జీలు తగ్గించకపోగా, కొత్తగా ట్రూ అప్ ఛార్జీల పేరుతో యూనిట్ కు 1 రూపాయి 23 పైసల భారాన్ని నష్టాల పేరుతో, సర్దుబాటు పేరుతో వేల కోట్ల రూపాయలు ప్రజలపై మోపడం సమంజసం కాదని అన్నారు. కరోనాతో పనులు లేక ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలు ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న ప్రజలపై, ఇప్పుడు కొత్తగా ట్రూ అప్ పేరుతో కరెంటు ఛార్జీలను పెట్టడం వలన సామాన్య ప్రజలు ఇంకా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, దీనిపై తక్షణం ప్రభుత్వం స్పందించి వచ్చే నెల నుంచి ట్రూ అప్ ఛార్జీలు లేకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శివరామిరెడ్డి, సుబ్బయ్య, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.