Logo
Date of Publish : 30 May 2023, 3:59 pm
Editor : Sake Naresh

పవన్ కళ్యాణ్ ను కించపరుస్తూ వైసీపీ ఏర్పాటు చేసిన బ్యానర్లు తొలిగించాలి

    గూడూరు ( జనస్వరం ) : గూడూరు పట్టణంలో వైసీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో పవన్ కళ్యాణ్ ఫోటో అభ్యంతకర రీతిలో ఉందని వెంటనే ఫ్లెక్సీలు తొలిగించాలని గూడూరు నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయ కర్త తీగల చంద్రశేఖర్ డిమాండ్ చేసారు.  జనసేన పార్టీ ఆధ్వర్యంలో మునిసిపల్ ప్రత్యేక అధికారి ఆర్‌డి‌ఓ కిరణ్ కుమార్, సీఐ దశరదరామ రావు, మునిసిపల్ మేనేజర్ కు వినతిపత్రం అందచేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ పట్టణంలో శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టి ఆందోళనకరమైన పరిస్థితులను నెలకొల్పేందుకే వైసీపీ ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణమాలు పట్టణంలో జరగకుండా మంచి వాతావరణం నెలకొల్పే దిశగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. జనసైనికుల మనోభావాలు కించపరిచేల ఏర్పాటు చేసిన బ్యానర్లు వెంటనే తొలగించాలని లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామన్నారు. అనంతరం పట్టణ అధ్యక్షులు ఇంద్రవర్ధన్ కుమార్ మాట్లాడుతూ గూడూరులో రాజకీయ పార్టీలను కించపరిచే విధంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం ఇప్పటివరకు లేదని, దీని వల్ల గొడవలు జరిగే అవకాశం ఉందన్నారు. ఫ్లెక్సీలు తొలగించకపోతే ప్రతిగా వైసీపీ నాయకుల ఫ్లెక్సీ లను ఏర్పాటు చేయాల్సి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్సులు విష్ణు, వంశీ, సూర్య ప్రతాప్, రఘు, కార్యదర్శులు శంకర్, ఓంకార్, సాయి, పాల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com