రాజంపేట ( జనస్వరం ) : రాప్తాడులో జర్నలిస్టులపై వైసీపీ నాయకులు దాడి చేయడం దారుణమని రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ అన్నారు. జర్నలిస్టులు అంటే ఫోర్త్ పిల్లర్స్, ఒక ఛానల్ ని ప్రత్యేకంగా చూడడం కొరవ చానల్ ని పక్షపాతంగా చూడడం సిగ్గుచేటు అన్నారు. వైసిపి పరిపాలన రౌడీల పరిపాలన లాగానే ఉంది. గుండాలు రాజ్యమేలునట్టుంది. జర్నలిస్టులపై దాడి చేస్తుంటే పోలీసులు చూస్తూ ఉండడం సిగ్గుచేటు. ఎక్కడో అనంతపురంలో జిల్లాలో మీటింగ్ కి అన్నమయ్య జిల్లా నుంచి ఆర్టీసీ బస్సులు తరలించడం ఏమిటి, రాజంపేట పరిసర ప్రాంత ప్రజలు వృద్ధులు బాలింతలు రవాణా సౌకర్యం లేక నిన్న తల్లడిల్లిపోయారు. ప్రజల సొమ్ముని స్వార్థం కోసం వాడుకోవడం దారుణం. ఇది ప్రజాస్వామ్యమా వైసీపీ రౌడీ రాజ్యమా అని రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత కార్యదర్శి రాటాల రామయ్య, లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు కత్తి సుబ్బరాయుడు, జనసేన నాయకులు భాస్కర పంతులు, శ్రీనివాసులు, గోపి, చౌడయ్య, వీరయ్య ఆచారి, కిషోర్, చంగల్ రాయుడ
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com