కళ్యాణదుర్గం ( జనస్వరం ) : రెండు రోజుల క్రితం రాప్తాడులో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నిర్వహించిన సిద్ధం అనే సభలో వైసిపి కార్యకర్తలు, నాయకులు ఆంధ్రజ్యోతి స్టాఫ్ ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ గారిపై చేసిన దాడి చేసిన సంగతి తెలిసిందే. అందుకు వ్యతిరేకంగా APUWJ కళ్యాణదుర్గం శాఖ ఆధ్వర్యంలో మీడియా ప్రతినిధులు, న్యూస్ రిపోర్టర్లు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళ్యాణదుర్గం నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన నాయకులు మీడియా వారిపై జరిగిన ఈ దాడిని పూర్తిగా ఖండిస్తూ, ఈ నిరసన కార్యక్రమానికి సంపూర్ణ మద్దతును తెలియజేశారు. తర్వాత ఈ కార్యక్రమంలో భాగంగా మీడియా ప్రతినిధులతో కలిసి జనసేన నాయకులు డివిజన్ ఆర్టీవో మరియు పట్టణ సీఐ గారికి మెమోరాండం ఇచ్చారు. భవిష్యత్తులో మీడియా వారిపై ఇలాంటి దాడులు మళ్లీ పునరావృతం అయితే తీవ్రమైన పరిణామాలు ఉంటాయి అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శులు నరసయ్య, జనసేన జిల్లా జాయింట్ సెక్రెటరీ జనసేన సమన్వయకర్త బాల్యం రాజేష్, జనసేన వీరమహిళ షేక్ తార, పట్టణ ఉపాధ్యక్షులు వంశీ, రూరల్ జనసేన మండల అధ్యక్షులు జాకీర్, శెట్టూరు జనసేన మండల అధ్యక్షులు కాంత్ రాజు, కళ్యాణదుర్గం జనసేన పట్టణ నాయకులు కార్తీక్, అనిల్, రహుల్ల, జనసైనికులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com