Search
Close this search box.
Search
Close this search box.

పశ్చిమ నియోజకవర్గంలో సీఎం జగన్మోహన్ రెడ్డి వాహన మిత్ర కోసం ఏర్పాటు చేసిన సభ ఫెయిల్ అయ్యింది

పశ్చిమ నియోజకవర్గం

          విజయవాడ ( జనస్వరం ) : జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గం ఇన్చార్జి పోతిన మహేష్ తన పార్టీ కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పోతిన మహేష్ గారు మీడియాతో మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సభ ఫెయిల్ అయిందని ఈ సభలో పశ్చిమ నియోజకవర్గ ప్రజలు గానీ, ఆటో డ్రైవర్లు గాని, స్థానికులు గాని పాల్గొనలేదని ఈ సభని సక్సెస్ చేయాలని నానకష్టాలు పడి విజయవాడ నగరానికి చుట్టుపక్కల గ్రామాల నుండి బస్సుల ద్వారా పెద్ద ఎత్తున ప్రజల్ని తరలించాలని చూస్తే ఖాళీ బస్సులో ఐదుగురో పదిమందో వచ్చారు. అదే విధంగా పశ్చిమ నియోజకవర్గంలో కూడా రాయల్ హోటల్ సెంటర్, పంజా సెంటర్ మరియు పరిసర ప్రాంతాల్లో పదుల సంఖ్యలో బస్సులు పెట్టిన కూడా ప్రజలు గాని, ఆటో డ్రైవర్లు గాని ఎవరూ కూడా వెళ్లలేదని అదేవిధంగా డ్వాక్రా మహిళలను కూడా బలవంతంగా తరలించే ప్రయత్నం చేసినా కూడా 50 మంది పట్టే బస్సులో కనీసం 10 మంది మహిళలు కూడా వెళ్లలేదని సభ కి వచ్చిన మహిళల్లో చాల మంది సభ మధ్యలోనే అక్కడ వున్న పోలీసు వారిని మీడియా వారిని బీసెంట్ రోడ్డు షాపింగ్ కి వెళ్ళాలి అడ్రస్ ఎక్కడ అని అడుగుతున్నారంటే వాళ్ళు వచ్చింది. వైసీపీ సభ కోసమొ వాహన మిత్ర కోసమో కాదనీ స్పష్టంగా అర్థం అవుతుందని అక్కడ వున్న పోలీసు అధికారులు సభకి వచ్చిన మహిళల్లి సభ మధ్యలో వెళ్లవద్దని లోపలికి వెళ్లి కూర్చోవాలని బ్రతిమిలాడుతున్నారని గేటికి తాళం వేసిన కూడా తోసుకొని బయటకు వచ్చేసారంటే వైసిపి ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంతటి వ్యతిరేకత ఉందో స్పష్టంగా అర్థమవుతుందని అన్నారు. ఈ సభని సక్సెస్ చేయడంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు పూర్తిగా వైఫల్యం చెందారని పశ్చిమ నియోజకవర్గ వైసిపి నాయకులే గుసగుసలాడుకుంటున్నారని, ఐదారువేల కుర్చీలు కూడా నింపలేక పోయాడని ఇలాంటి అట్టర్ ప్లాప్ నాయకుడు పశ్చిమ నియోజకవర్గం లో ఉండటం వల్ల పార్టీ సంకనాకి పోయిందని వైసిపి నాయకులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ సభలో ఆటో ఓనర్లకు గాని ఆటో డ్రైవర్లకు గాని హామీలు ఏమైనా ఇస్తారని చూస్తే ఒక్క హామీ కూడా ఇవ్వలేదని ఈ చలాన్లు అక్రమ కేసులు రద్దు చేస్తారని ఆటో డ్రైవర్లు చూస్తే ఎక్కడా కూడా ఆ ఉసేత్తలేదని ఈఎస్ఐ పిఎఫ్ లు వర్తింప చేస్తారని చూస్తే ఆ అంశం కూడా మాట్లాడలేదని, ఆటో డ్రైవర్ల కార్పొరేషన్ వెయ్యికోట్లతో ఏర్పాటు చేస్తారని చూస్తే ఆంశం కూడా మాట్లాడలేదని, మహిళా ఆటో డ్రైవర్లకు స్టాండ్ ఏర్పాటు చేస్తానన్న మాట కూడా మాట్లాడలేదని అన్నారు. అదే విధంగా అక్రమంగా చలాన్లు ఆటో డ్రైవర్ల మీద వేస్తున్నారని గతంలో 135 రూపాయలు వుండే చలానా ఈ రోజున 1350 రూపాయలు అక్రమంగా వసూలు చేస్తున్నారని వీటిని రద్దు చేస్తారని చూస్తే వాటి గురించి కూడా మాట్లాడలేదని డీజిల్, పెట్రోల్ ధరలు,గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయని దీనిలో స్టేట్ టాక్స్ ధరలు తగ్గించి ఆటో డ్రైవర్ కి మేలు చేసే విధంగా మాట్లాడతారు అనుకుంటే దాని గురించి కూడా మాట్లాడలేదని వచ్చిన కొద్ది మంది ఆటో డ్రైవర్లు కూడా జగన్ గారిని తిట్టుకుని నిరుత్సాహంగా వెను తిరిగారని ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారని అన్నారు. ఆయన వచ్చిన దగ్గరనుంచి పేదలకు పెత్తందారులకు మధ్య పోటీ అని మాట్లాడారని జగన్మోహన్ రెడ్డి గారే పెద్ద పెత్తందారని రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి సామాన్యులకే మధ్య పోరాటం అని ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్‌సి, నా ఎస్టి, నా బిసి, నా మైనార్టీ అంటూ ఒక్కరికి అయినా వారికి నామినేటెడ్ పదవైన ఇచ్చారా అని రెడ్డి సమాజక వర్గానికి పెద్దపెద్ద నామినేటెడ్ పదవులు టీటీడీ పదవులు వైస్ ఛాన్స్లర్ పదవులు ఇచ్చారు గాని ఎక్కడన్నా మా ఎస్సీలుకు గాని బీసీలకు గాని ఎస్టీలకు గాని మైనార్టీలకు గాని నిర్ణయాత్మక నామినేట్ పదవులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా అని అధికారం అడ్డం పెట్టుకొని దోచుకున్న పార్టీ ఏదైనా వుంది అంటే అది కేవలం వైసీపీ పార్టీ ఆ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారే కానీ వేరెవరు కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నానని అన్నారు.

              ఈ రాష్ట్రంలో ఎవరైనా ప్రజాబద్ధంగా గొంతుక వినిపించే అవకాశం లేదని, ఎవరైనా సరే గొంతు లేస్తే వారిపై సిఐడి తో కేసులు పెట్టి వారి గొంతు నొక్కేస్తున్నారని అదే విధంగా మీరు సిబిఐ కి అవినీతికి, అబద్దాలకి దత్తపుత్రుడని అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష నాయకుల్ని పై అక్రమ కేసులు పెట్టి వేధింపులు గురి చేయడం మీకు వెన్నతో పెట్టిన విద్య అయిపోయిందని స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారని అదే విధంగా లోకేష్ గారికి కూడా అక్రమ కేసులో నోటీసులు ఇచ్చారని ఈ రాష్ట్ర ప్రజలు ముక్తకంఠంతో మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారని దీనికి మీరు సమాధానం చెప్పాలని మీ మీద మూడు ఈడీ కేసులు ఉన్నాయని 13 సిబిఐ కేసులు ఉండి కూడా మీరేదో ఉత్తముల లాగా చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గారి గురించి అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని, అదేవిధంగా గత రెండు రోజుల నుంచి సాక్షి పేపర్లో ప్రతిపక్ష నాయకుల మీద ఇష్టం వచ్చినట్టు రాతలు రాస్తున్నారని ఇవన్నీ కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని దీనికి ఈరోజు పశ్చిమ నియోజకవర్గం లో జరిగిన సభే నిదర్శనమని ఈ రోజున సభనీ ఎస్సీలు ఎస్టీలు ముస్లింలు మైనార్టీలు బాయికాట్ చేశారని అందుకే ఈరోజు సభలో కనీసం 5000 కుర్చీలు కూడా నింప లేకపోయారంటే ప్రజల్లో మీకు ఏ స్థాయిలో వ్యతిరేకతుందో అర్థం చేసుకోవచ్చు అని మీరు పశ్చిమ నియోజకవర్గంకు ఇచ్చిన ఒక్క హామీ గురించి కూడా మాట్లాడలేదని పాత రాజరాజేశ్వరి పేట వాసుల ఇళ్ల పట్టాల గురించి, కొండ ప్రాంత వాసులు అభివృద్ధి గురించి ఎందుకు మాట్లాడలేదని అదేవిధంగా మీరు సభ నిర్వహించిన ప్రాంతంలో పేద ప్రజలకి ఇల్లు నిర్మించి ఇవ్వాలి అంటే దాని గురించి ఎందుకు మాట్లాడలేదని అదే విధంగా మీరు 200 కోట్ల రూపాయల విలువ చేసే రెండు ఎకరాల స్థలాన్ని కొట్టేసి అక్కడ వైసిపి కార్యాలయం నిర్మించే ప్రదేశాన్ని చూసుకున్నారా లేదా మీరు సమాధానం చెప్పాలని గాలిబ్ షా దర్గా కబ్జా భూముల్ని వెల్లంపల్లి శ్రీనివాసరావు చర నుండి విడిపిస్తానని ఎక్కడన్నా మాట్లాడారా నిన్న మీకు బహిరంగ లేక ఒకటి విడుదల చేశానని దానిమీద స్పందించి విచారణకు ఆదేశిస్తారని చూస్తే ఎక్కడా కూడా ఆదేశించలేదు అంటే ఈ అవినీతిలో మీకు కూడా భాగస్వామ్యం ఉందని అర్థమవుతుందని ఈ సందర్భంగా ప్రజా కోర్టులో మిమ్మల్ని దోషిగా నిలబెడుతున్నామని అదే విధంగా పశ్చిమ నియోజకవర్గం లో గెలిచిన ఒక మాయ ఎమ్మెల్యే అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు కి ఆయన వల్ల పార్టీ సంకనాకి పోయిందని రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ జిల్లాలో సభ పెట్టిన ఎక్కడా కూడా నిరసన సెగ తగలలేదని పశ్చిమ నియోజకవర్గం లోని జనసేన పార్టీ మూడు రోజుల నుండి గో బ్యాక్ సిఎం అని నిరసన జనసేన పార్టీ పోతిన మహేష్ ఆధ్వర్యంలో చేశారని సీఎం గారు వెల్లంపల్లికి డోసిచ్చి ఆయనకు సభలో మాట్లాడడానికి కేవలం మూడు నిమిషాలు మాత్రమే కేటాయించారని అందుకనే వెల్లంపల్లి శ్రీనివాసరావు సభలో ఏం మాట్లాడాలో అర్థం కాలేదని నేను ఏవైతే నియోజవర్గ సమస్యల గురించి మాట్లాడానో అవే సభలో మాట్లాడడని ఈ నాలుగున్నర ఏళ్ల కాలంలో కబ్జాల మీద అక్రమ వసూల్లు మీద దృష్టి పెట్టిన స్థానిక ఎమ్మెల్యే అతనికి నియోజకవర్గంలోని సమస్యల గురించి ఏం తెలుసని అందుకునే నేను మాట్లాడిన మాటలే సభలో మాట్లాడని అదే విధంగా అదేవిధంగా సభలో సీఎం గారు ప్రకటించిన హామీలను ప్రజలందరూ కూడా నమ్మవద్దని అదేవిధంగా రెల్లి సామాజిక వర్గం వారు కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ నమ్మొద్దని ఈ హామీలన్ని కాగితాలకే అని ఎవరూ కూడా లబ్ధి పొందే అవకాశం లేదని అదేవిధంగా సీఎం గారికి మా నిరసన సెగ తగలబట్టే సభను వేగంగా ముగించారని పశ్చిమ నియోజకవర్గం లో వైసీపీ గెలవదని రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోతిన మహేష్ భారీ మెజార్టీతో గెలుస్తాడని సందర్భంగా తెలియజేస్తున్నానని అదేవిధంగా అక్టోబర్ 1 నుంచి కృష్ణా జిల్లాలో వారహియాత్ర మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తున్నారని ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు కార్యకర్తలు ప్రజలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాను అని మాట్లాడడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way