కరోనా కట్టడిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరిగ్గా పని చేయడం లేదు.
- వైద్య సిబ్బంది రక్షణలో ఉదాసీనత
- ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వలేదు
- ఆ పథకంలో కేంద్ర ప్రభుత్వం రూ.9 వేల కోట్లు అందించింది
- ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన
- జనసేన, బిజెపి నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఆందోళన కలిగిస్తోందని జనసేన, బిజెపి పార్టీ కీలక నేతల సమావేశంలో అభిప్రాయపడ్డారు.ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా శాంపిల్స్ ఎక్కువగా సేకరిస్తున్నప్పటికి కరోనా తీవ్రతను అదుపు చేయడం లేదని సమావేశంలో పాల్గొన్న బిజెపి జాతీయ కార్యదర్శి శ్రీ వి. సతీష్ ఆందోళన చేశారు. వైద్యుల యెక్క పరిరక్షణకు సరిగ్గా ఏర్పాట్లు చేయడం లేదని స్పష్టంగా అర్థం అవుతోందని ఇరుపార్టీల నాయకులు అభిప్రాయబడ్డారు. కరోనా నివారణలో ఎక్కడ లోతుపాట్లు ఉన్నా కూడా ప్రజల పక్షాన నిలబడి ఉభయపక్షాలు పోరాటం చేయాలని నిర్ణయించుకొన్నాయి. ఈ విపత్కర సమయంలో దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదిగారు ప్రకటించిన ఆత్మ నిర్భర భారత్ ఆంధ్రప్రదేశ్ లో ఏవిధంగా జరుగుతుందో క్షుణ్ణంగా పరిశీలించి మళ్ళీ మీడియా సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇప్పటికే ఆత్మనిర్భర భారత్ కు సంబంధించిన వివరాలతో కూడిన కరపత్రాలను పంచామని తెలియజేశారు. గరీబ్ కళ్యాణ్ యోజన, సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి పరిశ్రమలు, వాణిజ్య సంస్థలకు అమలు చేస్తున్న పథకాలపై సమీక్ష నిర్వహించాలని ఇరు పార్టీలు నిర్ణయించుకొన్నాయి. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా నిర్మించిన ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకూ లబ్ధిదారులకు అందించలేదని అసహనం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం రూ.9 వేల కోట్లను అందించిందని గుర్తు చేసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల అమ్మకం, ప్రభుత్వ భూములు, గుంటూరు మార్కెట్ అమ్మకం, విద్యుత్ బిల్లుల విషయంలో ఇరు పార్టీలు పోరాడి సాధించిన విజయాలను గుర్తుచేసుకున్నారు. అలాగే ఈ లాక్ డౌన్ సమయంలో పేదలకు అందించిన నిత్యావసర సరుకులు అందించడంలో సంతృప్తి చెందినట్లు ఇరు పార్టీ నాయకులు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఏవైనా సమస్యలు ఉంటే ఇలాగే కలసి పోరాడాలని నిర్ణయించుకున్నాయి. ఈ సమావేశంలో జనసేన పార్టీ నుంచి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, బిజెపి పార్టీ నుంచి శ్రీ సతీష్ గారు, శ్రీ సునిల్ దియోదర్ గారు, శ్రీ జీవియల్ నరసింహా రావు, శ్రీ కన్నా లక్ష్మి నారాయణ గారు, శ్రీమతి పురందేశ్వరి గారు, శ్రీ సోము వీర్రాజు గారు, శ్రీ మధుకర్ గారు, ఈ సమావేశంలో పాల్గొన్నారు.