Logo
Date of Publish : 17 January 2026, 11:31 am
Editor : Sake Naresh

సంక్రాంతి సంబరాల్లో ‘అనంత క్రైమ్ స్టోరీ’ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

ధర్మవరం, అక్టోబర్ 17, (జనస్వరం) : శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం కాలేజ్ గ్రౌండ్‌లో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా ‘అనంత క్రైమ్ స్టోరీ – 2026 నూతన సంవత్సర క్యాలెండర్’ను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ అధికారికంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల భద్రత, నేరాలపై అవగాహన పెంపొందించడం, సమాజంలో చైతన్యం తీసుకురావడంలో అనంత క్రైమ్ స్టోరీ చేస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగకరంగా ఉండటంతో పాటు సామాజిక బాధ్యతను గుర్తు చేస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకను మరింత వైభవంగా నిర్వహించగా, సంక్రాంతి సంబరాల నడుమ క్యాలెండర్ ఆవిష్కరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో అనంత క్రైమ్ స్టోరీ ఎడిటర్ నాగేంద్ర యాదవ్‌తో పాటు బీజేపీ, టీడీపీ నాయకులు గిర్రాజు నాగేష్, జింక చంద్ర, సాకే ఓబులేసు, గొట్లూరు అనిల్, ఫణి కుమార్, కమతం కాటమయ్య, నాగూర్ హుస్సేన్, కేశగాల్ల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com