గుంతకల్ ( జనస్వరం ) : అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ మాట్లాడుతూ ప్రభుత్వం కుంటిసాకులు వెతుకుతూ అమ్మ ఒడి పథకం లక్ష మందికి పైగా లబ్ధిదారులను అనర్హులుగా తేల్చిందని అన్నారు. ఈ పథకం కింద 100% లబ్ధిదారుల ఖాతాల్లో కూడా 2 వేలు కోత పెడుతూ రూ.13వేలు మాత్రమే ప్రభుత్వం జమచేయనుందని అన్నారు. విద్యుత్తు వాడకం నెలకు 300యూనిట్లు దాటితే అమ్మఒడి పథకం అందదని, బియ్యం కార్డు కొత్తదిగా ఉండాలని, బ్యాంకు ఖాతాలకు ఆధార్ లింకు చేసుకోవడం, బ్యాంకు ఖాతాలు పని చేస్తున్నాయో లేవో విద్యార్థుల తల్లిదండ్రులు తనిఖీ చేసుకోవాలని నిబంధనలు పెట్టి తల్లిదండ్రులని ఇబ్బంది పెట్టారని అన్నారు. ఇలాంటి అర్థంపర్థంలేని నిబంధనల కారణంగా వైసిపి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా లక్షమందికి పైగా విద్యార్థులు అమ్మఒడి పథకానికి అనర్హులయ్యారని ప్రభుత్వం ప్రకటించింది. ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్ అన్న ముఖ్యమంత్రి మాకు బుద్ధి వచ్చేలా చేశారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ రాబోయే రోజుల్లో ఈ నయవంచక ప్రభుత్వానికి తగిన శాస్తి చేస్తామని నిరుపేద ప్రజానీకం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com