గుంటూరు ( జనస్వరం ) : రాష్ట్రంలో జరుగుతున్న అరాచకపాలన నుంచి ప్రజల్ని విముక్తి చేయటమే జనసేన టీడీపీ పొత్తు ప్రధాన లక్ష్యమని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. రాష్ట్ర భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకునే జనసేన టీడీపీ పొత్తుతో కలిసి ప్రయాణం చేయనున్నాయని ఆయన తెలిపారు. 2024 లో జరగనున్న ఎన్నికల్లో జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన నేపథ్యంలో రెండు పార్టీల నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావుతోటలో జనసేన పార్టీ డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ షర్ఫుద్దీన్, టీడీపీ డివిజన్ అధ్యక్షుడు షేక్ నాగూర్ ఆధ్వర్యంలో జనసేన టీడీపీ నాయకుల సంఘీభావ సమావేశం నిర్వహించారు. కేక్ కట్ చేసి, స్వీట్లు పంచిపెట్టి, బాణాసంచా కాల్చారు. వైసీపీ అంతం టీడీపీ జనసేన పంతం అరాచక పాలన అంతం – టీడీపీ జనసేన పంతం అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ వైసీపీ పాలనలో దాడులు , దౌర్హన్యాలు , అధికారిక దోపిడీలు పెరిగిపోయాయని వీటిని అంతం చేయాలి అంటే టీడీపీ, జనసేన శ్రేణులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఓటు చీలకూడదంటూ జనసేనాని మొదటినుంచి చెబుతూనే ఉన్నారని, పొత్తుతో ముందుకు సాగితేనే ఈ రాక్షస పాలన నుంచి ప్రజల్ని విముక్తి చేయటం సాధ్యమవుతుందన్నారు. వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ కునారిల్లిపోయాయని మరలా వాటిని తిరిగి నిర్మించాలంటే జనసేన టీడీపీ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. మరోసారి వైసీపీ వస్తే ఈ రాష్ట్రాన్ని దేవుడు కూడా కాపాడలేరని ఊహించని దారుణాలు జరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. జనసేన టీడీపీ నాయకులు , కార్యకర్తలు ఒకటిగా వైసీపీ దురాగతాలపై పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. నాలుగున్నరేళ్లుగా కొనసాగుతున్న ప్రజా కంఠక పాలనను అంతమొందించాలన్నా, ప్రజలు కోల్పోయిన స్వేచ్ఛను తిరిగి అందించాలన్నా జనసేన టీడీపీ శ్రేణులు క్షేత్రస్థాయిలో బలంగా పనిచేయాలని ఆళ్ళ హరి కోరారు. కార్యక్రమంలో జనసేన నేతలు, బండారు రవీంద్ర, మెహబూబ్ బాషా, రెల్లి నేత సోమి ఉదయ్, రామిశెట్టి శ్రీను, కోనేటి ప్రసాద్, బాలాజీ, అలా కాసులు, చంటి, సుబ్బారావు, బాల స్వామి, శ్రీను, కుమారస్వామి, టీడీపీ నేతలు షేక్ నాగూర్, గౌస్, నైజాం బాబు, ఖాజావాలి, నాగాగౌడ్, మన్నవ రఘు, మల్లెల కిషోర్, జిలాని, కరీం, వలి, రఫీ, బియ్యం శ్రీను తదితరులు పాల్గొన్నారు.