రాజంపేట ( జనస్వరం ) : కాపు కార్పొరేషన్ చైర్మన్ అడప శేషు కు దమ్ముంటే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై అవినీతి ఆరోపణలు రుజువు చేయాలని చిట్వేలు మండలం జనసేన నాయకులు మాదాసు నరసింహ సవాల్ విసిరారు. మరోసారి పవన్ కళ్యాణ్ గారి పైన పిచ్చిపిచ్చి ప్రేలాపనలు పేలితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. చిట్వేలు జనసేన పార్టీ కార్యాలయంలో మాదాసు నరసింహ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నది వైసీపీ ప్రభుత్వమేనని పవన్ కళ్యాణ్ గారు అవినీతి సొమ్ము ఎంత తీసు కున్నారో దానిని ఆధారాలతో రుజువు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మీరు చైర్మన్ గా ఉన్న కాపు కార్పొరేషన్ కి ప్రతి ఏడాది 2000 కోట్లు ఇస్తామన్నారు. ఈ నాలుగేళ్లలో ఎన్ని వేల కోట్లు రాబట్టావో లెక్క చెప్పరా..? విదేశీ విద్యా దీవెన పథకం కింద కాపు కుర్రాళ్ళకి విదేశాల్లో చదువుకోవడానికి నిధులు ఇస్తామన్నారు.. ఎంతమందికి విదేశాల్లో చదివిస్తున్నారో లెక్క చెప్పాలంటూ ఎద్దేవా చేశారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com