● ప్రజలకి పవన్ కళ్యాణ్ గారికి మధ్య వారధి జనసైనికులు
● వారిని భవిష్యత్తు నాయకులుగా తీర్చిదిద్దడమే నా ముందున్న సవాలు
● గంగాధర నెల్లూరు జనసేన పార్టీ ఇంఛార్జ్ డాక్టర్ యుగంధర్.
వెదురుకుప్పం, (జనస్వరం) : చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం ఆళ్లమడుగు గ్రామంలో అనారోగ్య రీత్యా మృతిచెందిన జ్యోతి, కేశవుల భౌతిక కాయానికి జనసేన పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువశక్తిని రాజకీయశక్తిగా మార్చడమే జనసేన పార్టీ లక్ష్యమని, ప్రజలకి పవన్ కళ్యాణ్ గారికి మధ్య వారధి జన సైనికులే అని అభివర్ణించారు. వారిని భవిష్యత్తు నాయకులుగా తీర్చిదిద్దడమే నా ముందున్న సవాల్ అని ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా కామసాని సతీష్ జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి, పవన్ కళ్యాణ్ మాత్రమే ఈ రాష్ట్రానికి సరి అయిన దిక్సూచని, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆయనే అని, ఆయన పాలనలో మాత్రమే కులము మతము ప్రాంతము భాషా భేదాభిప్రాయాలు లేకుండా అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందని పార్టీ కండువా కప్పుకోవడం జరిగిందని తెలిపారు. యువత ప్రత్యేకంగా రాజకీయాల్లోకి రావాలని, అణగారిన ప్రజలు అభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉందని, గ్రామాల్లో సర్వ రంగ సమగ్ర అభివృద్ధి జరగాలని, పట్టణాల్లో విశేషమైన ప్రగతి జరగాలని తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ యుగంధర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి మండలంలో ఐదు వందల మంది జనసైనికులను క్రియాశీలక సభ్యులు గుర్తించి, వారికి రాజకీయ శిక్షణా తరగతులు ఏర్పాటు చేసి అద్భుతమైన నాయకత్వ పటిమ గల గొప్ప నాయకులుగా తయారు చేసి ఈ నియోజకవర్గ ప్రజలకు ఉపయోగపడే విధంగా చేసి, వారిచేత మహోన్నతమైన కార్యాలు చేసేటట్లు, బాధ్యతను తీసుకుంటానని ప్రతిజ్ఞ చేశారు. 72 సంవత్సరాల కాలంలో మునుపెన్నడూ జరగని, ఏ నాయకుడూ చేయని మంచి పనులు ప్రజలకు చేసే విధంగా నాయకులను తయారు చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మోహన్ రెడ్డి, మధు రెడ్డి, గిరి, శరత్, జనార్దన్, వాసు, కోదండన్, జనసైనికులు పాల్గొన్నారు.