Logo
Date of Publish : 31 December 2023, 8:23 pm
Editor : Sake Naresh

ఉమ్మడి మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యం

- నియోజకవర్గ ప్రజలకు, జనసేన నాయకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

- రాబోయేది జనసేన తెలుగుదేశం ప్రభుత్వం 

- పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయాలు ప్రజల మనసుల్లోకి

- జనసేన ఇంచార్జ్ మరియు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ యుగంధర్ పొన్న

     గంగాధర నెల్లూరు ( జనస్వరం ) : కార్వేటి నగరం మండల కేంద్రంలోని జనసేన పార్టీ కార్యాలయంలో కార్వేటినగరం, వెదురుకుప్పం, పాలసముద్రం మండల ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి మరియు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ యుగంధర్ పొన్న మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు, జనసేన పార్టీ నాయకులకు, జనసైనికులకు, వీర మహిళలకు, అధికారులకు, అనధికారులకు, పోలీస్ సిబ్బందికి, పోలీస్ అధికారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2024 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయేది జనసేన తెలుగుదేశం ప్రభుత్వం అని తెలియజేసారు. పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయాలు ప్రజల మనసుల్లోకి తీసుకెళ్లి, ప్రజా మద్దతు కోరతామన్నారు. నియోజకవర్గంలో ఉమ్మడి మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశం కలిసి విజయటంకా మోగిస్తుందని, రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం పార్టీ సరికొత్త ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని, 175 నియోజకవర్గాల్లో సర్వరంగ సమగ్ర అభివృద్ధి సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్వేటినగరం మండల అధ్యక్షులు శోభన్ బాబు, కార్వేటినగరంటౌన్ కమిటీ అధ్యక్షులు రాజేష్, జిల్లా సంయుక్త కార్యదర్సులు భాను ప్రసాద్, రాఘవ, నరేష్, నియోజకవర్గ యువజన ప్రధాన కార్యదర్శి వెంకటేష్, నియోజకవర్గ కార్యదర్శి అన్నములై, వెదురుకుప్పం మండల అధ్యక్షులు పురుషోత్తం, నియోజకవర్గ బూత్ కన్వీనర్ యతీశ్వర్ రెడ్డి, టౌన్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ సూర్య నరసింహులు, వెదురు కుప్పం మండల ఉపాధ్యక్షులు మునిరత్నం శెట్టి, టౌన్ కమిటీ కార్యదర్శి బాల వరదయ్య, ఎం ఎం విలాసం పంచాయతీ అధ్యక్షులు రుద్ర పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com