సర్వేపల్లి ( జనస్వరం ) : నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో చేపట్టిన జనసేన విజయ యాత్ర ఆరవ రోజైన ఆదివారం మనుబోలు మండలంలో కొనసాగింది. సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు, ముత్తుకూరు, వెంకటాచలం మూడు మండలాల్లో పూర్తి చేసుకున్న విజయయాత్ర మనుబోలు మండలంలోని కొలనుకుదురు, కట్టుపల్లి, బద్వేలు, వెంకన్నపాలెం మీదుగా త్రీకోటేశ్వర స్వామి శివాలయానికి చేరుకుంది. బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం పార్టీల తరుపున పోటీ చేసే ఉమ్మడి అభ్యర్థి అఖండ మెజార్టీతో గెలుపొందాలని, సర్వేపల్లి నియోజకవర్గంలోని పుణ్యక్షేత్రాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నామని, ఆ భగవంతుని ఆశీస్సులు తప్పక ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క విజయ యాత్ర కొనసాగిస్తున్నామన్నారు. రాక్షస ప్రభుత్వం ఏర్పడి నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు అవుతుంటే ఇప్పటివరకు ఎక్కడ కూడా పూర్తిస్థాయిలో అభివృద్ధి గాని, పంచాయతీలో నిధులు గాని, పంచాయతీల అభివృద్ధి గానీ జరిగిన పరిస్థితులు లేవు. సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి రెండుసార్లు శాసనసభ్యుడిగా గెలిచి మంత్రిగా సర్వేపల్లి నియోజకవర్గాన్ని ఏం ఉద్ధరించలేదు. సర్వేపల్లి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి శూన్యం. సర్వేపల్లి నియోజకవర్గం పారిశ్రామికంగా, ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందుతుంటే స్థానికంగా ఉన్న పరిశ్రమల్లో సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్న యువతలో ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారో సమాధానం చెప్పండి. రాబోయే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీలు కలిసి ప్రజా ప్రభుత్వ స్థాపనలో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం. ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళ గుమినేని వాణి భవాని, స్థానికులు సుధాకర్ సుబ్రమణ్యం, వెంకటాచల మండల కార్యదర్శి శ్రీహరి, ముత్తుకూరు మండల సీనియర్ నాయకులు రహీం, అశోక్, వెంకటేష్, సుమన్, శ్రీనయ్య, మురళి తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com