Logo
Date of Publish : 29 April 2022, 1:55 pm
Editor : Sake Naresh

జనసైనికులను నాయకులుగా చేయడమే లక్ష్యం : జనసేన నాయకులు యుగంధర్ పొన్న

● జన సైనికులే పార్టీకి పట్టుకొమ్మలు

● మండల నాయకత్వం బలోపేతం దిశగా అడుగులు

     వెదురుకుప్పం, (జనస్వరం) : వెదురుకుప్పం మండల కేంద్రంలో మండల కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్  డాక్టర్ యుగంధర్ పొన్న హాజరై, మాట్లాడుతూ జనసైనికులు నాయకులుగా చేయడమే లక్ష్యమని తెలియజేశారు. రాబోయే రోజుల్లో జన సైనికులే పార్టీకి పట్టుకొమ్మలని ఉద్ఘాటించారు. మండల నాయకత్వాన్ని బలోపేతం చేసి ప్రజల పక్షాన, ప్రజా క్షేమం కోసం పోరాటం చేసే దిశగా అడుగులు వేయాలని దిశానిర్దేశం చేశారు. రేపటి నుండి మూడు రోజులపాటు జరిగే జనసైనికుల కోసం జనసేన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు పార్టీని బలోపేతం చేసి, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చేయాల్సిన అవసరం వచ్చిందని తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఉందని, నిత్యావసర సరుకులు మొదలుకొని, నిత్యం వాడే వస్తువులు వరకు ధరలు ఆకాశాన్ని అంటిoదని ఎద్దేవా చేశారు. జనసేన పార్టీ ప్రశ్నించే స్థాయి నుంచి ప్రస్తుతం అధికారం చేపట్టే స్థాయి ఎదిగిందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పురుషోత్తం, గౌరవ అధ్యక్షులు మధు, ప్రధాన కార్యదర్శి సతీష్, వెంకట ముని, సీనియర్ నాయకులు జగదీశ్వర్ రెడ్డి, జనసైనికులు ఉదయ్, అజయ్, హరీష్ పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com