
విజయనగరం ( జనస్వరం ) : దుర్మార్గపు వైసిపి ప్రభుత్వాన్ని పారద్రోలి పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా గద్దె నెక్కించడమే జన సైనికుల లక్ష్యమని జనసేన నేత గురాన అయ్యలు అన్నారు. గురువారం స్ధానిక జీఎస్ఆర్ హోటల్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీం పిడికిలి వాల్ పోస్టర్లును గురాన అయ్యలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అయ్యలు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ,ఆయన సేవాభావాన్ని, సేవా తత్పరతను, నిస్వార్ధంగా చేస్తున్న సేవలను ప్రజలకు వివరించి, పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. ప్రజల సమస్యల గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే… సమాధానం చెప్పలేని వైకాపా నేతలు పవన్ మూడు పెళ్లిళ్ల గురించే ప్రతిసారీ మాట్లాడుతున్నారని తప్పుబట్టారు. పవన్ విడాకులు తీసుకొని మూడు పెళ్లిళ్లు చేసుకుంటే జగన్ కు వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. సీఎం స్థాయిని మరిచి జగన్ దిగజారి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయపరంగా ఎన్ని విమర్శలైనా చేయొచ్చని, కానీ తరచుగా వ్యక్తిగత విమర్శలు, దూషణలు చేయడం, వ్యక్తిత్వ హననానికి పాల్పడడం సరికాదని హితవు పలికారు. ప్రతిపక్ష నేతలపై నిందలు వేయడం ఏంటని మండిపడ్డారు. రాజకీయంగా విమర్శించేందుకు ఏమీ లేనందునే పవన్ పై వ్యక్తిగత విమర్శలకు జగన్, వైసీపీ నేతలు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా జనం నుంచి పవన్ కళ్యాణ్ ని వేరు చేయడం అసాధ్యమన్నారు రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ అధిక స్థానాలలో విజయం సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు ఎల్ .రవితేజ, రేగిడి లక్ష్మణరావు, కాటం అశ్విని, మాతా గాయిత్రి, సుంకరి వంశీ, వజ్రపు నవీన్ కుమార్ , ఎమ్ .పవన్ కుమార్ , అడబాల వేంకటేష్ , హిమంత్ , కంది సురేష్, కోలగట్ల తేజ, పృథ్వీ భార్గవ్, మధు తదితరులు పాల్గొన్నారు.