Logo
Date of Publish : 23 November 2020, 9:41 am
Editor : Sake Naresh

వాడవాడలా జనసేన జెండా ఎగర వేయడమే లక్ష్యం : యుగంధర్ పొన్న

వాడవాడలా జనసేన జెండా ఎగర వేయడమే లక్ష్యం : యుగంధర్ పొన్న

              గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటినగరం మండలం జనసేన పార్టీ ఆధ్వర్యంలో మేధోమధన కార్యక్రమం పార్టీ ఆఫీసు నందు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మరియు రాయల దక్షిణ కోస్తా జాయింట్ పార్లమెంటరీ కమిటీ సభ్యులు డాక్టర్ యుగంధర్ పొన్న పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యుగంధర్ పొన్న మాట్లాడుతూ మండల కమిటీ ఆధ్వర్యంలో మేధోమధన కార్యక్రమం ఏర్పాటు చేయడం శుభ పరిణామమని, పార్టీని గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు పటిష్ట పరచాలని పరచాల్సిన అవసరం ఉందని, వ్యక్తిత్వ నిర్మాణంతో పాటు జ్ఞానసముపార్జ తో ప్రతినిత్యం ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఉన్నత స్థితిలో నుండి ఉత్తమ స్థితికి ప్రతి ఒక్కరూ చేరుకొని బూతు స్థాయిలో కార్యకర్తలను కూడా వ్యక్తిత్వ నిర్మాణం తో పాటుగా సామాజిక సేవలో రాజకీయ సేవలో ప్రతి ఒక్కరిని కార్యోన్ముఖులు చేయవలసిన బాధ్యతను మండల కమిటీ నాయకులు బాధ్యత తీసుకోవాలని తెలియజేశారు.

         ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రస్తుత పాలకవర్గం ఎవరు కూడా ప్రజలను పట్టించుకోవడం లేదని స్వలాభం కోసమే, స్వప్రయోజనం కోసమే పని చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎవరికోసం ఈ పాదయాత్రలు? ఎవరిని ఉద్ధరించడానికి కోసం ఈ వ్యయప్రయాసలు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ప్రస్తుత ప్రభుత్వానికి త్వరలో గుణపాఠం చెబుతారని తెలిపారు. నిరుపేదలను పట్టించు కోవడం మరచి పోయారని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సురేష్ నాయుడు, మండల ఉపాధ్యక్షులు విజయ్, భాస్కర్ రెడ్డి అధికార ప్రతినిధి మహేష్, ప్రధాన కార్యదర్శి దేవా, కార్య నిర్వాహక సభ్యులు చంద్ర, యుగంధర్, విజయ్, మణి, హేమాద్రి, జగదీష్, చక్రి, నియోజకవర్గ సమన్వయకర్తలు భాను చంద్రారెడ్డి రాఘవ, పెనుమూరు మండల అధ్యక్షులు భానుప్రసాద్, గంగాధర్ నెల్లూరు మండలం అధ్యక్షులు జైపాల్ రాజు, నియోజకవర్గ సమన్వయకర్తలు నరేష్ రెడ్డి, మోహన్ రెడ్డి, వెంకటేష్, మండల ప్రచార కార్యదర్శి కే చంద్రమౌళి కార్యదర్శి వెంకటేష్ హేమాద్రి, వెదురుకుప్పం మండలం నాయకులు మధు ప్రశాంత్ సతీష్, నాయకులు నాదముని తరుణ్ పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com