
శ్రీకాకుళం ( జనస్వరం ) : జనసేన నాయకులు కరిమజ్జీ గ్రామగ్రామాన తిరుగుతూ జనసేన పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నారు. ఆయన గెడ్డకంచరాం గ్రామాల్లో పర్యటించారు. సామాన్యులను పలకరించి జనసేన పార్టీ సిద్దాంతాలను, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను గూర్చి చెప్పారు. అలాగే ప్రభుత్వ వ్యతిరేఖ పనులను గూర్చి వివరించారు. జనసేన పార్టీ మ్యానిఫెస్టో గూర్చి వివరిస్తూ, జనసేన ఆవిర్భావం దినోత్సవం రోజున పవన్ కళ్యాణ్ గారు చెప్పిన షణ్ముఖ వ్యూహం గూర్చి తెలిపి ప్రజలలో అవగాహన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పొట్నూరు లక్ష్మునాయుడు తదితర జనసైనికులు పాల్గొన్నారు.