Logo
Date of Publish : 05 December 2022, 8:32 am
Editor : Sake Naresh

శింగనమల కేజీబీవీకి సరుకులు అందిస్తున్న ఏజెన్సీని రద్దు చేయాలి

             అనంతపురం ( జనస్వరం ) : సింగనమల మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో డిసెంబర్ రెండవ తేదీపాయిజన్ ఫుడ్ తిని విద్యార్థులు తీవ్రత అస్వస్థతకు గురి కావడం జరిగింది. అయితే విద్యార్థులకు అందిస్తున్న ఏజెన్సీలు సరుకులు నాణ్యత లేకపోవడంతో కుళ్లిన సరుకులతో వంటలు చేయడం వల్ల మజ్జిగ విషతుల్యమై విద్యార్థులు అస్వస్థతకు గురై వాంతులు విరేచనాలు అయ్యాయి. కడుపునొప్పితో బాధపడుతూ ఆస్పత్రుల పాలవడం జరిగింది. అయితే అధికార యంత్రాంగం ఏజెన్సీని వంట మనుషులను తప్పించకుండా అధికార పార్టీ నాయకుల అండదండలతో సంబంధం లేని వారికి షోకాజ్ నోటీసులు ఇవ్వడం సమంజసం కాదని అన్నారు ఏజెన్సీ వారు అందించిన నాణ్యత లేని సరుకులపై ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన వెంటనే సరుకులను సరఫరా చేయు ఏజెన్సీని మరియు అధికార పార్టీకి చెందిన వంట మనుషులను వెంటనే తప్పించాలని అధికార పార్టీ నాయకుల ప్రోత్బలంతో కుళ్ళిన సరుకులను సరఫరా చేస్తున్నారని బాధితులు బహిరంగంగానే చెబుతున్నా విద్యార్థినులకు న్యాయం జరగలేదు. 82 మంది విద్యార్థినులు వివిధ ప్రైవేట్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందారు. పిల్లల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న ఏజెన్సీ నితప్పించేంతవరకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు సాగిస్తూంటామని ఎంతవరకైనా పోరాడుతామని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి సాకే మురళి కృష్ణ, జిల్లా కార్యదర్శి చొప్పా చంద్ర, జిల్లా సంయుక్త కార్యదర్శులు బొమ్మన పురుషోత్తం రెడ్డి, దేవరకొండ జయమ్మ, నాయకులు బందెల సాయి శంకర్, మన్నల పెద్దిరాజు, శేషు, మధు జూలకలువ, తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com