రాజంపేట, (జనస్వరం) : వినాయక చవితి వేడుకలపై ప్రభుత్వ ఆంక్షల ను నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్ మరియు హిందూ సంఘాలకు మద్దతుగా రాజంపేట జనసేన పార్టీ తరఫున సబ్ కలెక్టర్ గారికి స్పందన కార్యక్రమంలో మరియు డి.ఎస్.పి గారికి ఉత్సవాలకు ఎలాంటి ఆటంకం జరగకుండా ప్రజాస్వామ్య హక్కులను కాపాడే విధంగా కరోనా నిబంధనలను పాటిస్తూ వేడుకలు జరుపుకోవడానికి సహకరించాలని వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. కరోనా కారణంగా సాధ్యాసాధ్యాలను పరీక్షించి తగిన విధంగా నిర్ణయం తీసుకుంటామని సబ్ కలెక్టర్ కేతన్ గార్గ్ గారు జనసేన నాయకులకు చెప్పారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో జనసేన పార్టీ నాయకులు బాల సాయి కృష్ణ గారు మాట్లాడుతూ బ్రిటిష్ వారి నుండి స్వతంత్రం వచ్చినా వారి వారసులు ఇంకా రాచరిక పాలన పాలిస్తున్న విధంగా అన్యమత పండుగలకు, రాజకీయ సమావేశాలకు, సినిమా హాళ్ళకు, బ్రాందీ షాపులకు కరోనా నిబంధనలు పాటించక పోయినా అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం, హిందూ పండుగలకి మాత్రమే ఆంక్షలు విధించటం హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఉందని హిందువులు తప్పని సరిగా పండుగను జరుపుకుంటారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు , ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి తప్ప ఆంక్షలు విధించి ఇబ్బందులు ప్రభుత్వమే సృష్టించటం సరైంది కాదని అని అన్నారు. ప్రభుత్వాలు పక్షపాత ధోరణి వహించటం సమాజానికి మంచిది కాదు, ప్రభుత్వం పునః పరిశీలన చేసి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉత్సవ విగ్రహలను పెట్టుకొని పూజలు నిర్వహించే విధంగా భక్తులకు చర్యలు తీసుకోవాలని అధికారులను, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వినాయక చవితి కోసం వేలాదిమంది విగ్రహాలను కొనుగోలు చేయగా ఆఖరి నిమిషంలో అన్ని షాపులు తెరిచి ఉన్నా, నాయకుల వర్థంతి వేడుకలు, ఊరేగింపులు, అన్యమత పండుగలకు వర్తించని కరోనా కేవలం హిందూ పండుగలకు మాత్రమే విధించడం ప్రభుత్వ కుట్రగా మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉంది. ఈ దేశంలో రాజ్యాంగబద్ధంగా సంప్రదాయాలను గౌరవిస్తూ పండుగ జరుపుకోవడం కోసం అనుమతి తీసుకోవలసిన పరిస్థితి అప్రజాస్వామికం. ప్రభుత్వ వైఖరి మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో కచ్చితంగా ప్రజలు తిరగబడతారు అని ప్రభుత్వానికి హితవు పలికారు. అంతేకాకుండా నియోజకవర్గ రోడ్ల దుస్థితి మీద వీడియోల రూపంలో సోషల్ మీడియాలో మీడియా ద్వారా ప్రభుత్వానికి అందజేసిన కూడా అధికార పార్టీ నాయకులు రోడ్లు అద్భుతంగా ఉన్నాయని కౌంటర్ ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని ప్రజలే న్యాయనిర్ణేతల అని ఈ సందర్భంగా జనసేన నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ సభ్యులు పలు హిందూ సంఘాలు రాజకీయ పార్టీ నాయకులు, జనసేన పార్టీ రాజంపేట నాయకులు బాల సాయి కృష్ణ, కోలాటం హరికృష్ణ , ముత్యాల చలపతి, నరహరి మందా, మహేష్ ఉమా శంకర్, గోవర్ధన ఆచారి మరియు జనసేన కార్యకర్తలు తదితురులు పాల్గొన్నారు..
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com