ఒంగోలు ( జనస్వరం ) : 12వ డివిజన్ లో డివిజన్ అధ్యక్షులు అనిల్ కుమార్ కటకం శెట్టి గారి ఆధ్వర్యంలో ప్రజా సమస్యలను తెలుసుకోవడంలో భాగంగా 70వ రోజు ఒంగోలులోని 12వ డివిజన్ మిరియాలపాలెంలో పర్యటించారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక మహిళలు మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను అధికారంలోకి వస్తే మా మహిళలకు ఏమి చేస్తారో తెలియజేసిన విధానం మమ్మల్ని బాగా ప్రభావితం చేసిందని, ఇప్పటివరకు నాయకులు మాటల్లోనే చెప్పారు. కానీ ఆచరణలో చేసింది ఏమీ లేదని కానీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పదవుల్లోనే మహిళలకు అగ్రస్థానం వేసి చూపించారు. అటువంటి నాయకుడికీ మా మహిళలందరూ సమిష్టిగా ఒక అవకాశం ఇచ్చి రాష్ట్ర అభివృద్ధిలో మేము సైతం భాగస్వాములు అవుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు రాయని రమేష్, కళ్యాణ్ ముత్యాల, ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పల్ల ప్రమీల, ఒంగోలు నగర జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి ఆకుపాటి ఉష, వీర మహిళ మాదాసు సాయి నాయుడు, 38 వ డివిజన్ అధ్యక్షులు ఆలా నారాయణ, 21వ డివిజన్ అధ్యక్షురాలు వాసుకి నాయుడు, 28వ డివిజన్ అధ్యక్షులు కోట సుధీర్ మరియు జనసేన నాయకులు బండారు సురేష్, చంగళశెట్టి సుధాకర్, మహేష్ జగతపి, సుధాకర్ పసుపులేటి, బొమ్మిశెట్టి సుబ్రహ్మణ్యం, నరసింహారావు, అవినాష్ నాయుడు పర్చూరి, ఏల్చూరి రవీంద్ర, సాయి కొట్ర, ఉంగరాల వాసు, తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com