- తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
నెల్లూరు, జూలై 24 (జనస్వరం): నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 22వ డివిజన్ బి.వి.నగర్‌లోని కె.ఎన్.ఆర్. మున్సిపల్ హైస్కూల్లో మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంతటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలో చదువుతున్న విద్యార్థులందరికీ 'తల్లికి వందనం' పథకం కింద నేరుగా తల్లుల ఖాతాల్లో నగదు జమ చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లదేనని అన్నారు. నెల్లూరు రూరల్‌లోని కె.ఎన్.ఆర్. పాఠశాలకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎల్లప్పుడూ అండగా ఉన్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో నాలుగైదు తరగతులకు ఒకే ఉపాధ్యాయుడు ఉండేవారని, ప్రస్తుతం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ 'ఒక తరగతికి ఒక ఉపాధ్యాయుడు' విధానాన్ని అమలు చేశారని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని చదువులో రాణించి, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆరోగ్యకరమైన పౌష్టికాహారాన్ని అందించేందుకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా ప్రతిరోజూ మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్చార్జ్ కంతే సాయిబాబా, కో-క్లస్టర్ ఇన్చార్జ్ కోటి రెడ్డి, 22వ డివిజన్ కార్పొరేటర్ మూలే విజయభాస్కర్ రెడ్డి, 22వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు యానాది రెడ్డి, 23వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు మేకల మధు, టీడీపీ నాయకులు పుల్లారెడ్డి, యోగానందం, రాఘవ, సురేంద్ర, నారాయణ, మణి, రోహిణి, మల్లికార్జున రెడ్డి, ఈశ్వర్ రెడ్డి, వెంకట రెడ్డి, సుబ్బా రెడ్డి, వెంకి తదితరులు పాల్గొన్నారు.