
ఆలయ అభివృద్ధికి, ex.మిలటరీ అసోసియేషన్ బిల్డింగ్ నిర్మాణానికి రూ. 100000 విరాళం అందించిన తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్
మిలటరీ మాధవరంలో ex.మిలటరీ అసోసియేషన్ బిల్డింగ్ నిర్మాణానికి ₹50,000 లు విరాళంగా మరియు తాడేపల్లిగూడెం వానపల్లి గూడెంలో శివాలయం నిర్మాణానికి ₹.50,000 లు విరాళంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు అందించారు. ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ జనసైనికులు తమ దృష్టికి తీసుకురాగా పవన్ కళ్యాణ్ గారి స్పూర్తితో సహాయం అందించడం జరిగింది అన్నారు. అలాగే ఈ కరోనా సమయంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని, ప్రజలకు ఏం కష్టం వచ్చినా ఆదుకోవడానికి ముందు ఉంటానని తెలిపారు.