ఆలూరు ( జనస్వరం ) : ఆలూరు మండల పరిషత్ ఆవరణంలో సంత మార్కెట్ లో రెండేళ్ల క్రితం నిర్మించిన కాంప్లెక్స్ లకు వేలంపాటలు పాటలు నిర్వహించాలని జనసేన పార్టీ ఆలూరు నియోజకవర్గ ఇన్చార్జి వెంకప్ప డిమాండ్ చేశారు. ఆలూరు ఎంపీడీవో అల్లాబకాష్ ను కలిసి వినతిపత్రం అందించారు. అయన మాట్లాడుతూ రూరల్ అర్బన్ నిధుల రూ.1.20 కోట్లతో సంతమార్కెట్లోని 27 గదులు, ఎంపిడిఒ కార్యాలయం ముందు ఉన్న రూ.80 లక్షలతో నిర్మించిన కాంప్లెక్స్ ను సంవత్సరాలు గడిచినా ప్రారంభించడం లేదని తెలిపారు. పెండింగులో ఉంచి పంచాయతీకి, మండల అభివృద్ధికి నష్టం కలిగిస్తున్నారని చెప్పారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో అధికారులు విఫలం చెందారన్నారు. నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర మంత్రి గుమ్మనూరు జయరాం గారు దృష్టి సారించి దుకాణాలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. తద్వారా నిరుద్యోగులకు అవకాశం లభిస్తుందన్నారు. దుకాణాలు ప్రారంభించకపోవడం వల్ల అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారాయన్నారు. వచ్చే నెలలోపు ప్రారంభించకుంటే జనసేన ఆధ్వర్యంలో నిరాహారదీక్ష చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆలూరు జనసేన పార్టీ నాయకులు మహేష్, మహానంది, బడేసాబ్, ఖలీల్, సాయి, కృష్ణ పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com