Logo
Date of Publish : 19 March 2023, 3:04 pm
Editor : Sake Naresh

షాపింగ్ కాంప్లెక్స్ ను ప్రారంభించాలని డిమాండ్ చేసిన తెర్నేకల్ వెంకప్ప

           ఆలూరు ( జనస్వరం ) : ఆలూరు మండల పరిషత్ ఆవరణంలో సంత మార్కెట్ లో రెండేళ్ల క్రితం నిర్మించిన కాంప్లెక్స్ లకు వేలంపాటలు పాటలు నిర్వహించాలని జనసేన పార్టీ ఆలూరు నియోజకవర్గ ఇన్చార్జి వెంకప్ప డిమాండ్ చేశారు. ఆలూరు ఎంపీడీవో అల్లాబకాష్ ను కలిసి వినతిపత్రం అందించారు. అయన మాట్లాడుతూ రూరల్ అర్బన్ నిధుల రూ.1.20 కోట్లతో సంతమార్కెట్లోని 27 గదులు, ఎంపిడిఒ కార్యాలయం ముందు ఉన్న రూ.80 లక్షలతో నిర్మించిన కాంప్లెక్స్ ను సంవత్సరాలు గడిచినా ప్రారంభించడం లేదని తెలిపారు. పెండింగులో ఉంచి పంచాయతీకి, మండల అభివృద్ధికి నష్టం కలిగిస్తున్నారని చెప్పారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో అధికారులు విఫలం చెందారన్నారు. నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర మంత్రి గుమ్మనూరు జయరాం గారు దృష్టి సారించి దుకాణాలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. తద్వారా నిరుద్యోగులకు అవకాశం లభిస్తుందన్నారు. దుకాణాలు ప్రారంభించకపోవడం వల్ల అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారాయన్నారు. వచ్చే నెలలోపు ప్రారంభించకుంటే జనసేన ఆధ్వర్యంలో నిరాహారదీక్ష చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆలూరు జనసేన పార్టీ నాయకులు మహేష్, మహానంది, బడేసాబ్, ఖలీల్, సాయి, కృష్ణ పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com