పాడేరు ( జనస్వరం ) : జనసేనపార్టీ మండల నాయకులు ఉల్లి సీతారామ్ తెరపల్లి, పెడబరడా గ్రామ యువకులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఉల్లి సీతారామ్ మాట్లాడుతూ గిరిజన యువతకు ఉపాధి కల్పన కోసం వారిలోఉన్న సృజనాత్మక సంపద సృష్టి చేసి వారి ఆర్థిక బలోపేతం కోసం నియజకవర్గంలో సుమారు 500 మంది యువకులను ఎంచుకుని వారికి10 లక్షల రూపాయలు రుణాలు మంజూరు చేసి అనుకున్న పారిశ్రామిక రంగంలో ముందస్తు శిక్షణ ఇచ్చి వారికి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దే ఆలోచన చేస్తున్నారన్నారు. అలాగే యువతను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు శక్తివంచన లేకుండా కృషిచేస్తురన్నారు .విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో బోట్లు కోల్పోయిన మత్సకారులకు తన సొంత సంపదలో ఉన్నంతలో ప్రతి వ్యక్తికి 50వేల నగదు అందజేసి ఆదుకున్నారు. ఏ అధికారం చేపట్టకపోయిన నావంతుగా నా ప్రజలకు ఏమి చెయ్యాలనే ఆలోచన చేసే అరుదైన నాయకుడు పవన్ కళ్యాణ్ గారన్నారు. మార్పు కోరే రాజకీయాలకు పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారని గిరిజన యువకులు ఈ విషయమై ఆలోసించి రానున్న సార్వత్రిక ఎన్నికలకు జనసేనపార్టీకి అండగా ఉండాలన్నారు. ఈ సందర్బంగా తెరపల్లి, లబ్బరు గొంది, పెడబరడ గ్రామ యువకులకు వాలి బాల్ కిట్లు పంపిణీ చేశారు.