పాలకొండ, (జనస్వరం) : పార్వతీపురం జిల్లా పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండల బొడ్లపాడు గ్రామంలో టెన్త్, ఇంటర్ విద్యార్థులు పరీక్షల కొరకు కరెంటు కొరతలు వల్లన ఇలా డాబాలు పైకి ఎక్కి విద్యార్థులు ఒక చోటకి చేరి కొవ్వొత్తులు వెలిగించుకొని చదవవలసిన పరిస్థితి ఏర్పడిందని జనసేన నాయుకులు వజ్రగడ రవికుమార్ జానీ తెలిపారు. మరి ఎప్పటికప్పుడు కరెంట్ ఆగిపోతుందని ఆవేదన చెందుతున్నారు. పరీక్ష సమయంలో కూడా కరెంట్ లేకపోతే ఏ విధంగా చదవగలరు ఎలా పాస్ అవ్వగలరని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మరి విద్యార్థులు దృష్టిలో పెట్టుకొని పది, ఇంటర్ పరీక్షలు పూర్తియ్యే వరకు కరెంటు కొరత అనేది ఉండకూడదని విద్యార్థులు అలాగే వారి యొక్క తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. దీనిని జనసేన పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. కరెంటు కొరత లేకుండా విద్యార్థులు పరీక్షలకు కరెంటు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండాలి అని జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేయడం జరిగింది.