సర్వేపల్లి ( జనస్వరం ) : నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలం నారికెళ్లపల్లి గ్రామం నందు పర్యటించిన సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు. ఆయన మాట్లాడుతూ ఆసియా ఖండంలోని రెండవ స్థానంలో కృష్ణపట్నం పోర్టు ఉంది. ఈ పోర్టుని అధికార వైసిపి పార్టీ అప్పనంగా అమ్మేసే దానికి తరిమేసే దానికి పూర్తిస్థాయిలో సన్నాహాలు జరుగుతున్నాయి. అదే విధంగా కంటైన టెర్మినల్ ని పూర్తిస్థాయిలో తరలించేసి పదివేల కుటుంబాలు రోడ్డున పడేదానికి కారకులు వైసిపి నాయకులు. కాబట్టి సర్వేపల్లి నియోజకవర్గంలోని ప్రతి కుటుంబం కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం కలిసి ఉమ్మడి అభ్యర్థికి ఓటు వేసి గెలిపించుకుంటే దేశ చరిత్రలోనే రెండో స్థానంలో ఉన్నటువంటి కృష్ణపట్నం పోర్టుని కాపాడుకుందాము. ఈ కృష్ణపట్నం పోర్టు వల్ల అనేక కంపెనీలు వచ్చి అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కలిగి నిరుద్యోగ వ్యవస్థ నుంచి ఉద్యోగ అవకాశాలు కల్పించుకుని మన కుటుంబాలు అన్ని కూడా బాగుంటాయి మన సర్వేపల్లి నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా ఏదైతే మన కృష్ణపట్నం పోర్టుకు భూములు ఇచ్చిన రైతులు వాళ్ళందరికీ కూడా వాళ్ళ కుటుంబాలకి వాళ్ల కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకి ఉద్యోగ అవకాశం కలిగితే ఆ కళ్ళముందే వాళ్ళ బిడ్డలు ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటూ తల్లిదండ్రులను చూసుకుంటూ ఎంతో ఆనందంగా ఉంటారు. కాబట్టి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా చేతులు జోడించి నమస్కరించి జనసేన పార్టీ నుంచి ఒకటే కోరుతున్నాను. రేపు రాబోయేది ప్రజా ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ఆశీర్వదించి సర్వేపల్లి నియోజకవర్గంలో ఘన విజయాన్ని సాధిస్తే ఈ అవినీతి పరిపాలన నుంచి మన నియోజకవర్గానికి కూడా కాపాడుకున్న వాళ్ల మవుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు గుమినేని వాణి భవాని, ముత్తుకూరు మండల సీనియర్ నాయకులు రహీం, అశోక్, స్థానికులు బాలు, మస్తాన్, గిరి, వెంకటాచలం మండల కార్యదర్శి శ్రీహరి, సాత్విక్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.