Logo
Date of Publish : 08 June 2022, 4:31 pm
Editor : Sake Naresh

ప్రభుత్వ వైఫల్యానికి ప్రతీక పది ఫలితాలు : అనంత జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్ర

                అనంతపురం ( జనస్వరం ) : ప్రభుత్వ వైఫల్యానికి పదవ తరగతి పరీక్షలు ప్రతీకగా నిలిచాయని జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్మర నాగేంద్ర అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయుల్ని నాడు- నేడు పనులకి కాపలా పెట్టడంతో వారు పిల్లలకి చదువు చెప్పడం మానేసి ఈ పనుల్లో నిమగ్నమయ్యారన్నారు. పాఠాలు చెప్పే ఉపాధ్యాయులను తన మద్యం బ్రాండ్లు అమ్మే షాపులకి కాపలా పెట్టిన ముఖ్యమంత్రే, దిగజారిన ఫలితాలకు ప్రధాన కారకుడని ఆరోపించారు. పాఠాలు చెప్పే ఉపాధ్యాయుల్ని సీపీఎస్‌ రద్దు, ఫిట్మెంట్ హామీలతో మోసగించడంతో వారు ఆందోళనలతో రోడ్డెక్కి, బోధనకి దూరం చేసింది జగన్ సర్కారే అని మండిపడ్డారు. ఈ మూడేళ్లలో ఒక్క కొత్త టీచర్ని కూడా వేయకపోవడం వల్ల విద్యార్థులకి చదువు చెప్పేవారే లేక ఫలితాలు దారుణంగా వచ్చాయన్నారు. పరీక్షల వేళ విపరీతమైన కరెంటు కోతలు, పరీక్షా సమయం కుదింపు, పేపర్‌ లీక్‌, మాల్‌ ప్రాక్టీస్‌, మాస్‌ కాపీయింగ్లతో విద్యార్థులు మానసికంగా బాగా దెబ్బతిన్నారని, ఈ కారణాలు కూడా ఫలితాలపై ప్రభావం చూపాయన్నారు. మీడియం గందరగోళం, ఎయిడెడ్‌ పాఠశాలల రద్దు, పరీక్ష పత్రాల తయారీ విధానంలో లోపాలతో 20 ఏళ్లలో ఎన్నడూ రాని దారుణ ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. విద్య శాఖపై సిఎంకు ఉన్న ఆసక్తి ఏ పాటిదో స్పష్టం అయింది అన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com