నెల్లూరు సిటీ ( జనస్వరం ) : నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట 220వ రోజున 15వ డివిజన్ బాలాజీనగర్ లక్కీ బోర్డు సెంటర్ సచివాలయ వీధి ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికీ తిరిగిన కేతంరెడ్డి ప్రజా సమస్యల అధ్యయనం చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వసతుల కల్పన, రోడ్ల నిర్మాణం, పేదలకు గృహాల నిర్మాణంలో కనీస స్థాయి అభివృద్ధి కూడా చేయని వైసీపీ ప్రభుత్వం ఈరోజు బటన్ నొక్కే ఉచితాలకు ప్రజలు ఏమారుతారని భావిస్తూ రాష్ట్రాన్ని తిరోగమన మార్గంలోకి తీసుకెళ్తోందని దుయ్యబట్టారు. ప్రభుత్వ ఉద్యోగులకు నెలనెలా జీతాలు ఇచ్చే గతి లేని విధంగా రాష్ట్రాన్ని నాశనం చేసి ఇప్పుడు తమ ప్రచార ఆర్భాటాలకు కోట్లాది రూపాయలను వెచ్చిస్తూ గుడిని, బడిని కూడా వదలట్లేదని ఎద్దేవా చేశారు. స్కూల్ పిల్లలకు మౌళిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది, ఇక్కడ వసతుల కల్పనకు వెచ్చించే నిధుల కంటే ప్రచారాలకు ఎక్కువ నిధులు కేటాయించడం సిగ్గుచేటని, దేవాలయాల్లో, విశ్వవిద్యాలయాల్లో కూడా వైసీపీ హోర్డింగులను ఏర్పాటు చేయడం ఈ ప్రభుత్వ మితిమీరిన పోకడలకు నిదర్శనం అని అకేతంరెడ్డి వినోద్ రెడ్డిన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.