Logo
Date of Publish : 24 November 2025, 9:27 pm
Editor : Sake Naresh

వి.సి లతో తెలుగు, సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్. డి. విల్సన్ భేటీ

తిరుపతి, నవంబర్ 24 : ఆంధ్రప్రదేశ్ తెలుగు, సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్.డి విల్సన్ తిరుపతి పట్టణంలోని వివిధ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు, ఇతర ఉన్నతాధికారులతో సోమవారం భేటీ అయ్యారు. ఈ సందర్బంగా మహిళా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొ. వి.ఉమాను కలిసి తెలుగు అకాడమీ అభివృద్ధికి సహకరించాలని కోరారు. యూనివర్సిటీ ప్రింటింగ్ వర్క్స్ ఇస్తానని ఉమా హామీ ఇచ్చారు. సమావేశంలో యూనివర్సిటీ రిజిస్టార్ ప్రొ. రజని పాల్గొన్నారు. తదుపరి ఎస్.వి. యూనివర్సిటీ రిజిస్టార్ భూపతి నాయుడు, రెక్టార్ ప్రొ. అప్పారావు లతో విల్సన్ భేటీ వేశారు. రిజిస్టార్ యూనివర్సిటీ సమస్యలను ఏకరువు పెట్టారు. కోర్టులో వచ్చిన తీర్పుల వల్ల రిక్రూట్మెంట్ ఆలస్యమవుతుందన్నారు. ప్రభుత్వం దృష్టికి సమస్య తీసుకొచ్చామని పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నామన్నారు. ఇందుకు తన వంతు సహకారం అందిస్తానని విల్సన్ హామీ ఇచ్చారు. అనంతరం జాతీయ సంస్కృత యూనివర్సిటీని సoదర్శించారు. యూనివర్సిటీ రిజిస్టర్ ప్రొ. కడియం వెంకట నారాయణ, డీన్ ఎకడమిక్స్ రజనీకాంత్ శుక్ల తదితరులు ఆహ్వానం పలికి శాలువా కప్పి సన్మానించారు.

 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com