హైదరాబాద్, (జనస్వరం) : హైదరాబాద్ లోని సైదాబాద్ సింగరేణి బస్తీలో దారుణ హత్యకి గురైన ఆరేళ్ళ చిన్నారి చైత్రకి న్యాయం చెయ్యాలని, నిందితుడికి ఉరిశిక్ష పడేలా చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఈరోజు పలు సంఘాల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఈ రిలే నిరాహార దీక్షకి జనసేన పార్టీ తరపున జనసేన తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జ్ శ్రీ .నేమూరి శంకర్ గౌడ్ గారు హాజరై సంపూర్ణ మద్దతు తెల్పడం జరిగింది. అనంతరం శంకర్ గౌడ్ గారు మాట్లాడుతూ చైత్ర కుటుంబానికి న్యాయం జరిగేంతవరకు జనసేన పార్టీ అండగా ఉంటుందన్నారు. నిందుతున్ని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వానికి జనసేన పార్టీ తరుపున డిమాండు చేస్తున్నాం అని అన్నారు .
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com