హైదరాబాద్ ( జనస్వరం ) : ఒక గిరిజన మహిళ తన బిడ్డ పెళ్లి పనుల కోసం ఈ నెల ఆగస్టు 15వ తారీఖున హైదరాబాద్ కి రావడం జరిగింది. అకారణంగా ఆ గిరిజన మహిళను పోలీసులు ప్రాస్టిట్యూట్ అని చెప్పి పోలీస్ స్టేషన్ కి తిస్కొచి రెండు రోజులు విచక్షణ రహితంగా ఆమె పై దాడి చేశరని, తన దగ్గర ఉన్న బంగారం, డబ్బులు కూడా తీసుకున్నారన్న విషయం జనసేన పార్టీ వైరా నియోజకవర్గ ఇంఛార్జి సంపత్ నాయక్ గారి దృష్టికి రాగానే వెంటనే ఎల్బి నగర్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం జరిగింది. బాధిత మహిళను పరామర్శించి, ఈ ఘటనకు పాల్పడిన పోలీసులను వెంటనే సప్సెండ్ చేయాలని, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టాలని జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఎల్బి నగర్ నియోజకవర్గ ఇంఛార్జి సాయి శిరీష పొన్నూరు, ఓయూ నేత వినోద్ నాయక్, గిరిజన సంఘ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com