బైక్ మెకానిక్ శస్త్రచికిత్స కోసం 5 వేలు ఆర్థిక సహాయం అందించిన టెక్కలి జనసేన

బైక్ మెకానిక్ శస్త్రచికిత్స కోసం 5 వేలు ఆర్థిక సహాయం అందించిన టెక్కలి జనసేన

                        టెక్కలి మండలం నీలాపురం గ్రామానికి చెందిన ద్విచక్రవాహన మెకానిక్ బొడ్డు నారాయణ రావుకు జనసేన పార్టీ టెక్కలి నియోజకవర్గ నాయకులు కూరాకుల యాదవ్, అట్టాడ శ్రీధర్ లు ₹5000/- ఆర్ధిక సహాయం అందజేశారు. శనివారం టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు అనుకోని తాను పొట్ట కూటి కోసం నిర్వహిస్తున్న ద్విచక్ర వాహనాల దుకాణం వద్ద 5వేలు నగదు మొత్తాన్ని అందజేశారు. నారాయణ రావు కడుపులో కొన్నాళ్లుగా చెడిపోయిన పెద్ద ప్రేగు శస్త్రచికిత్స నిమిత్తం దాతల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో థీమ్ ల్యాబ్ ఎన్విరాన్మెంటల్ కన్సల్టెన్సీ హైదరాబాద్ కు చెందిన సాయి ప్రసాద్ ఈ ఆర్ధిక సహాయాన్ని చేశారు. కడు పేద కుటుంబానికి చెందిన నారాయణ రావు దీన పరిస్థితి తెలుసుకుని మిత్రులు యాదవ్ , శ్రీధర్ ల ద్వారా ఈ ఆర్ధిక సహాయం అందించారు. ఈ పరిస్థితికి కారణం డాక్టర్ల నిర్లక్ష్యం అని నారాయణ రావు విస్మయం చెందారు. దాతల సహాయంతో ఈ శస్త్రచికిత్స కోసం అవసరమైన 7 లక్షల రూపాయలు సమకూరుస్తున్నానని ఈ సందర్భంగా మెకానిక్ నారాయణ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో రాయి సునీల్, హనుమంతు దిలీప్, పాసుపురెడ్డి సోమేశ్, తోట శ్యాం, బొడ్డేపల్లి వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way