
టెక్కలి, (జనస్వరం) : జనసేనపార్టీ బలోపేతంలో భాగంగా జనసేన టెక్కలి ఇంచార్జ్ కణితి కిరణ్ కోట బొమ్మాలి మండలం రేగులపాడు గ్రామంలో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను కలుసుకొని జనసేన సిద్ధాంతాలను తెలియజేస్తూ, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను వివరిస్తూ గ్రామం అంతా పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు తమ గ్రామ ప్రధాన సమస్యలైన త్రాగునీరు, పారిశుద్ధ్య సమస్యలను కిరణ్ దృష్టికి తీసుకువెళ్లారు. తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలపై ఉన్నతాధికారులకు వివరించి సమష్య పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ పర్యటనలో కోటబొమ్మాలి మండల నాయకులు పల్లి కోటి, ఇలపండరమేష్, సుధీర్, శ్రీను ఎంపీటీసీ సభ్యులు, గ్రామ జనసైనికులు రాము తదితరులు పాల్గొన్నారు.