రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఉపాధ్యాయ సంఘాల సమైక్య (FAPTO) తాలూకా కేంద్రాల్లో చేస్తున్న ధర్నాలో భాగంగా టెక్కలి అంబేత్కర్ జంక్షన్ లో జరుగుతున్న FAPTO ధర్నాకు జనసేన పార్టీ మద్దతుగా నిలిచింది.ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా అమలు కాకపోవడంతో ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకించారు. వారం రోజుల్లో రద్దు చేస్తామన్న CPS విధానాన్ని రెండు సంవత్సరాలు గడుస్తున్నా అతీగతీ లేదు. అధికారంలోకి వచ్చాక 6 DA లు బకాయి పడిన ప్రభుత్వం ఇంతవరకూ ఒక్క DA కూడా అమలు చేయలేని పరిస్థితి. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి అమలు చేయాల్సిన PRC గురించి ప్రభుత్వం కనీసం ప్రస్తావన చేయడం లేదు. ఇవి కాక సర్వీసు పరమైన ఇంకా అనేకము పెండింగ్ లో ఉన్నాయి అని పేర్కొన్నారు. వీటన్నీంటిని తక్షణం పరిష్కరించాలని FAPTO తరుపున జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో FAPTO నాయకులతో పాటు జనసేన టెక్కలి నాయకులు కురాకుల యాదవ్, అట్ఠాడ శ్రీధర్, పసుపురెడ్డి సోమేశ్, హనుమంతు దిలీప్, కొమ్ము అరుణ్, చల్లా అభిమరియు జనసైనికులు తదితురులు పాల్గొన్నారు..