Logo
Date of Publish : 29 September 2020, 9:22 am
Editor : Sake Naresh

కాకరాపల్లి గ్రామ సమస్యలపై టెక్కలి జనసేన ఇంచార్జ్ కణితి కిరణ్ పర్యటన

కాకరాపల్లి గ్రామ సమస్యలపై టెక్కలి జనసేన ఇంచార్జ్ కణితి కిరణ్ పర్యటన

             జనసేన పార్టీ బలోపేతంలో భాగంగా సంతబొమ్మాళి మండలం కాకరాపల్లి గ్రామంలో ఈ రోజు టెక్కలి జనసేన ఇంచార్జ్ కణితి కిరణ్ పర్యటించి పలు గ్రామ సమస్యల్ని తెలుసుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యంగా గ్రామానికి అనుకుని ఉన్న క్వారీ లో ఉపయోగించే బ్లాస్టింగ్ వలన తమ పంట పొలాలు, ఇంటి గోడలు దెబ్బతింటున్నాయని మరియు బ్లాస్టింగ్ శబ్దాల వలన రాత్రిపూట భయంతో గడపవలసి వస్తుందని గ్రామస్థులు తెలియజేసారు. ఇదే విషయాన్ని ఆ గ్రామ ప్రజలు అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన ఉపయోగం లేకుండా పోయిందని కణితి కిరణ్ దగ్గర వాపోయారు. ఈ ఊరిలో ఉన్న తుఫాన్ రక్షిత భవనం శిథిలావస్థకు చేరుకున్నదని, గ్రామంలో ని కొందరు వారి సొంత అవసరాలకు తుఫాన్ భవనం ను వాడుకొంటున్నారని తెలియజేసారు. వెంటనే స్పందించిన కిరణ్ సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువత పల్లి మల్లేష్, వెంకట్, శివ, సిమ్మన్న, మరియు జడ్పీటీసీ అభ్యర్థి చిన్నారెడ్డి, అనిల్ పొగటి, కొత్తూరు హరి, విరాట్ చందు, కల్కి, సాయి, తెలుగు శంకర్, సాయి మహంతి పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com