చిత్తూరు ( జనస్వరం ) : కార్వేటినగరం మండలంలో ప్రభుత్వ భూములు రోజురోజుకీ అన్యాక్రాంతం అవుతున్నాయని జనసేన పార్టీ గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ యుగంధర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కలికిరి ఇండ్లు సమీపాన ఏర్పాటు చేసిన నిరసన దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ R.K.V.B పేట గ్రామ పంచాయతీలో దుష్యంత్ రెడ్డి అనే వైసీపీ నేత స్మశానం భూమిలో బోరు వేసుకుని అనుభవిస్తున్నారు, ఆయన స్థానిక సర్పంచ్ భర్త మరియు సొసైటీలో ముఖ్య కార్యనిర్వహణ అధికారి. వీరికి కూడా రేషన్ కార్డు స్థానిక తాసిల్దార్ అమరేంద్ర బాబు 15/02/2020 వ తేది మంజూరు చేశారు. వీరికి ఓసీ కి బదులు బీసీ సర్టిఫికెట్ మంజూరు చేశారు. కుల మార్పిడి సర్టిఫికెట్ ఇవ్వడానికి వారి వద్ద ఎంత తీసుకుంటున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్మశాన భూమిని ఆక్రమించి అనుభవిస్తున్న మరొక నేత, రమేష్ రాజు అనే వైసిపి నేత ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకుని, ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని అనుభవిస్తున్నాడు ఎన్నిమార్లు ఎన్ని మార్లు అర్జీలు ఇచ్చిన నోరు మెదపకుండా సమస్యను పరిష్కరించకుండా కాలయాపన చేస్తూ వస్తున్న అమరేంద్ర బాబును సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్ వారిని విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. అనుభవజ్ఞుడైన అధికారి అంధకారంలో ఉండటం ఈ మండలానికి సిగ్గుచేటని ఆవేదన వ్యక్తం చేశారు. మండల అధ్యక్షులు శోభన్ బాబు మాట్లాడుతూ నా సొంత గ్రామం పాదిరి కుప్పం అని చెప్పుకునే ఉప ముఖ్యమంత్రి గ్రామంలోని 20 మంది రైతులకు రైతు భరోసా రాలేదని, జగన్మోహన్ రెడ్డికి తన చర్మం ఒలిచి చెప్పులు కుట్టే ఇస్తామని ఉత్తర ప్రగల్భాలు పలికిన మంత్రి, 12 సంవత్సరాలు అహర్నిశలు నీకోసం సర్వస్వం ధారబోసిన కార్యకర్తల చర్మం ఒలిచి నీ కాళ్ళ కింద తొక్కి ఎదిగిన మీరు కార్యకర్తలకు ఉపయోగపడలేదు ప్రజలకి ఏమి ఉపయోగపడతారని, కుటుంబానికి మాత్రమే ఉపయోగ పడ్డారని ఎద్దేవా చేశారు. రెవెన్యూ పాలన గాడి తప్పిందని తెలియజేశారు. ప్రభుత్వ స్థలాల ఆక్రమిత స్థలాల కు కంచె వెయ్యకపోతే తొందరలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల గౌరవ అధ్యక్షులు భాను చంద్ర రెడ్డి నియోజకవర్గ సమన్వయకర్త రాఘవేంద్ర, జిల్లా సంయుక్త కార్యదర్శి వెంకటేష్, మండల కార్యదర్శి రాజేష్, అధికార ప్రతినిధి వెంకటేష్, పాలసముద్రం మండల అధ్యక్షులు లతీష్, మండల నాయకులు సతీష్,రాకేష్ హేమాద్రి రెడ్డి, వెంకటేష్, గోవిందు, గిరి, యువరాజ్ హరీష్, అన్నామలై, రాకేష్, జనసైనికులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com