న్యూస్ ( జనస్వరం ) : టీం సైనిక ఫౌండర్ అమీర్ ఖాన్ (సౌదీ అరేబియా) నేతృత్వంలో పాపోలు అప్పారావు (దుబాయ్ పారిశ్రామిక వేత్త, UAE జనసేన టీం లీడర్) గారి అధ్యక్షతన రేఖా జివ్వాజీ (AP జనసేన వీర మహిళా చైర్ పర్సన్), రత్నా పిల్లా (తెలంగాణ వీర మహిళా వైస్ చైర్ పర్సన్), రావి సౌజన్య (కృష్ణా పెన్నా రీజినల్ కోఆర్డినేటర్), రాయపాటి అరుణ (పార్టీ అధికార ప్రతినిధి), బండి ప్రసాద్ (తెలంగాణ IT కోఆర్డినేటర్), నల్లం శ్రీనివాస్ (జనసేన ప్రముఖ నాయకులు) గార్లు ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసారు. ఈ జూమ్ సెషన్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లోని జనసైనికులు, వీర మహిళలు & లీడర్లు పాల్గొని పార్టీ గ్రౌండ్ లెవల్ లో బలోపేతం చేసే దిశలో ఎదురు ఆవుతున్న సమస్యలు, అధికార పక్షం నుండి ఎదురౌతున్న సమస్యలు, దాష్టీకాలు, ఇంచార్జ్లు లేనిచోట ఏవిధంగా కేడర్ను సమన్వయం చేసుకొని వెళ్ళాలని కోరారు. పార్టీ కార్యకర్తలకు వచ్చే ఎన్నికలకు ఏవిధంగా కష్ట పడాలి అనే అంశాల పై చర్చించటం జరిగింది. ఈ సమావేశంలో రాజంపేట ఇంచార్జ్ హరి రాయల్, నూజివీడు వీర మహిళ నాయకురాలు రామిశెట్టి తేజస్వినీ, ఒరిస్సా రాష్ట్ర జనసేన లీడర్ VSM శ్రీరామ్, విజయవాడ దుర్గ గుడి ధార్మిక మండలి మెంబర్ , 5వ డివిజన్ ఉపాధ్యక్షురాలు నిట్ల ఉమా మహేశ్వరి, ఆరుగోలను జనసేన లీడర్ బాదం నాని (Hyd), టీం సైనిక గ్రూప్ లీడర్లు రాజమండ్రి నుండి సుధాకర్, ఒంగోలు నుండి పరుచూరి అవినాష్ నాయుడు, NRI లు సాయి కృష్ణ తేజ ( USA, MS Student), దుబాయ్ నుండి రవి వర్మ,ముని కుమార్, కువైట్ నుండి టీం సైనిక లీడర్ విజయ్ గౌడ్, సౌదీ అరేబియా నుండి షాహిద్, గల్ఫ్ సేన నుండి నరసింహ రావు, మంగళగిరి నుండి ఆల్ jsp నియోజక వర్గం గ్రూప్ లీడర్ & టీం సైనిక గ్రూప్ Expert గా సేవలు నందిస్తున్న కొడాలి నాగ మల్లేశ్వర రావు, తణుకు మాధవ్ రాయుడు, తెలంగాణా వీర మహిళా విభాగం నుండి పార్టీ ఎక్జిక్యూటివ్ మెంబర్ ప్రభావతి, కార్యదర్శులు అరుణ కుమారి, లక్ష్మీ మొలబంటి, నాగలక్ష్మి, జగ్గయ్య పేట నుండి శైలజ, శ్రీకాకుళం నుండి బాలరెడ్డి, నెల్లూరు 5వ డివిజన్ ఇంచార్జీ రేవంత్, అలేఖ్ పృథ్వీ , భాను, నాగరాజు, Sk కంతార్, రమేష్, సతీష్ మొదలగు జన సైనికులు, వీర మహిళలు, నాయకులు పాల్గొన్నారు. అతిథులు అందరూ టీం సైనిక చేసే ఆక్టివిటీస్ ను కొనియాడుతూ పార్టీ కార్యకర్తలకు దిశా నిర్దేశం చెయ్యటం జరిగింది.